వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార స‌ర్కార్ కూసాలు క‌ద‌ల‌డానికి ప‌ది కార‌ణాలివే! అంతా స్వ‌యంకృతాప‌రాథ‌మే

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: ఎలాంటి అద్భుతాలు చోటు చేసుకోలేదు. ఎలాంటి అనూహ్య ఘ‌ట‌న‌లూ న‌మోదు కాలేదు. అంతా ఊహించిన‌ట్టే..అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్టే క‌ర్ణాట‌క‌లో 13 నెల‌ల పాటు కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయింది.. పేక‌మేడ‌లా! క‌ర్ణాట‌క అసెంబ్లీలో అయిదు రోజుల పాటు కొన‌సాగిన హైడ్రామాకు తెర‌ప‌డింది. రోజులు లెక్క‌బెట్టుకుంటూ వ‌చ్చిన కుమార‌స్వామి ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం సాయంత్రం బ‌ల‌ప‌రీక్ష‌లో ఓడిపోయింది.

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్‌కు మూడు అంకెల దూరంలో నిలిచిపోయింది. అదే స‌మ‌యంలో- ప్ర‌తిప‌క్ష భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌న బ‌లాన్ని నిరూపించుకోగ‌లిగింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఇప్ప‌ట్నుంచే స‌న్నాహాల‌ను ఆరంభించింది కూడా. చేతికి అందిన అధికారాన్ని కోల్పోవ‌డ‌మనేది ఏ రాజ‌కీయ పార్టీకైనా బాధాక‌ర‌మే. దీనికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించుకుంటే- కుమారస్వామి ప్ర‌భుత్వం స్వ‌యం కృతాప‌రాధ‌మే అధికంగా క‌నిపిస్తోంది. రాజ‌కీయ పండితుల విశ్లేష‌కుల అంచ‌నాల ప్ర‌కారం.. కుమార‌స్వామి స‌ర్కార్ కుప్ప‌కూల‌డానికి గ‌ల ప‌ది కార‌ణాలు ఇవే..

 బెంగ‌ళూరులో తీవ్ర ఉద్రిక్త‌త: 144 సెక్ష‌న్ అమ‌లు..ప‌బ్‌లు, మ‌ద్యం దుకాణాలు బంద్‌! బెంగ‌ళూరులో తీవ్ర ఉద్రిక్త‌త: 144 సెక్ష‌న్ అమ‌లు..ప‌బ్‌లు, మ‌ద్యం దుకాణాలు బంద్‌!

హంగ్ అసెంబ్లీ..

ఇందులో మొద‌టి కార‌ణం.. త్రిశంకు అసెంబ్లీ. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అస‌వ‌ర‌మైన సంఖ్యాబ‌లం ఎవ‌రికీ మెజారిటీ ద‌క్క‌క‌పోవ‌డం. ఫ‌లితంగా- రెండు భిన్న ధృవాలు, వైరి పార్టీలు కూట‌మి క‌ట్టాల్సి వ‌చ్చింది. అధికారాన్ని పంచుకోవాల్సి వ‌చ్చింది. గ‌త ఏడాదే జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-78, జ‌న‌తాద‌ళ్ (ఎస్‌)-39 సీట్ల‌ను గెలుచుకోగ‌లిగాయి. 105 స్థానాల‌తో భార‌తీయ జ‌న‌తాపార్టీ అత్య‌ధిక స్థానాల‌ను గెల‌చుకున్న పార్టీగా ఆవిర్భ‌వించింది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన 112 స్థానాలకు దూరంగా ఉండిపోయింది. ఏ పార్టీకీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య ద‌క్క‌క‌పోవ‌డం హంగ్ అసెంబ్లీకి దారి తీసింది.

అప‌విత్ర కూట‌మి..

బీజేపీకి అధికారాన్ని ద‌క్క‌కుండా చేయాల‌నే ఉద్దేశంతో శ‌తృవులు చేతులు క‌లిపారు. మిత్రుల‌య్యారు. కూట‌మి క‌ట్టారు. అధికారాన్ని అందుకున్నారు. కాంగ్రెస్‌-జేడీఎస్ క‌లిసి 116 స్థానాల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి క‌ట్ట‌డంతోనే పార్టీ ప‌త‌నం ఆరంభ‌మైంద‌నే అభిప్రాయాలు అప్ప‌ట్లోనే వినిపించాయి. నిజానికి- 13 నెల‌ల పాటు కొన‌సాగ‌డం కూడా గొప్ప విష‌య‌మేన‌ని అంటున్న వారూ లేక‌పోలేదు. దీన్ని అప‌విత్ర పొత్తుగా అభివ‌ర్ణించారు. కాంగ్రెస్‌, జేడీఎస్ ఐడియాల‌జీ వేరు. కులం ప్రాతిప‌దికా వేరు. ఓట్ల శాత‌మూ వేరు. పైగా- ఒక‌రికి ప‌ట్టు ఉన్న ప్రాంతాల్లో మ‌రొక‌రు జొర‌బ‌డ‌టం అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు దారి తీసింది. కూట‌మి ప‌త‌నాన్ని శాసించింది.

కుమార అభ్య‌ర్థిత్వం..


ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి అభ్య‌ర్థిత్వాన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు. వారిలో ముఖ్యుడు మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌. త‌న రాజ‌కీయ కేరీర్‌ను జేడీఎస్ నుంచే ఆరంభించిన ఆయ‌న ఆ పార్టీ నేత‌ల పెద్ద‌ల‌తో ప‌డ‌క కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. చివ‌రికి- తాను వ్య‌తిరేకించిన పార్టీతోనే జ‌ట్టు క‌ట్టాల్సిన ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక్క సిద్ధు మాత్ర‌మే కాకుండా- కొంద‌రు ఎమ్మెల్యేలు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. గోకక్ ఎమ్మెల్యే ర‌మేష్ జార్కిహోళి, అథ‌ణి శాస‌న స‌భ్యుడు మ‌హేష్ కుమ‌ట‌హ‌ళ్లి, విజ‌య‌పుర నుంచి ఎన్నికైన ఆనంద్ సింగ్‌.. వీరంతా కుమార‌స్వామి అభ్య‌ర్థిత్వాన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..

ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌రువాత కుమారస్వామి చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సైతం.. సంకీర్ణ కూట‌మిలో చిచ్చు పెట్టింది. కీల‌క‌మైన పోర్ట్‌ఫోలియోల‌ను త‌న అనుచ‌రుల‌కు క‌ట్ట‌బెట్టార‌నే అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వ్య‌క్త‌మైంది. ఇందులో భాగంగానే- ర‌మేష్ జార్కిహోళి త‌న మంత్రిప‌ద‌వికి రాజీనామా చేయ‌డం. త‌న సోద‌రుడు హెచ్‌డీ రేవ‌ణ్ణ‌కు కీల‌క శాఖ‌ను అప్ప‌గించ‌డం సైతం కాంగ్రెస్‌కు రుచించ‌లేదు. 39 సీట్ల‌తోనే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కొట్టేశార‌నే అసంతృప్తి మొద‌టి నుంచీ కాంగ్రెస్ స‌భ్యుల్లో వ్య‌క్తమౌతూ వ‌చ్చింది.

ప్రాంతాల మ‌ధ్య అస‌మ‌తౌల్యం లోపించ‌డం..

జేడీఎస్‌కు గ‌ట్టి ప‌ట్టు ఉన్న ద‌క్షిణ ప్రాంత జిల్లాలు మైసూరు, మండ్య‌, చామ‌రాజ న‌గ‌ర‌, హ‌స‌న్‌, తుమ‌కూరుల నుంచి ఎన్నికైన శాస‌న‌స‌భ్యుల‌కు మంత్రివ‌ర్గంలో పెద్ద‌పీట వేశారు కుమార‌స్వామి. ఉత్త‌ర ప్రాంత జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ఎన్నికైన కాంగ్రెస్ స‌భ్యుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. ప్ర‌స్తుతం తిరుగుబాటు జెండా లేవనెత్తిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ స‌భ్యులు క‌ర్ణాట‌క ఉత్త‌ర ప్రాంత జిల్లాలైన విజ‌య‌పుర‌, బెళ‌గావి, ఉత్త‌ర క‌న్న‌డ‌, హ‌వేరిల‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి..

నిజానికి- మొన్న‌టి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి నామ‌మాత్రంగా కూడా పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న కుమారుడు నిఖిల్ గౌడ‌ను, తండ్రి, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌ను గెలిపించుకోలేక‌పోయారంటే ప‌రిస్థితి తీవ్రత అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఎన్నిక‌లు బీజేపీకి ఊపిరిపోసినట్ట‌యింది. 28 లోక్‌స‌భ స్థానాలు ఉన్న క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల‌నాథులు 26 స్థానాల‌ను కైవ‌సం చేసుకోగ‌లిగారు.

ఆప‌రేష‌న్ క‌మ‌ల‌..

బీజేపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌మ‌ల వ‌ల్ల ప‌రిస్థితులు చేజారిపోతున్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తున్న‌ప్ప‌టికీ.. దాన్ని అడ్డుకోవ‌డంలో కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి దారుణంగా విఫ‌ల‌మైంది. బీజేపీ సీనియ‌ర్ నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌మ‌ల ప్ర‌భావం వ‌ల్లే కుమార సర్కార్ కుప్ప‌కూలింద‌న‌డంలో సందేహాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం రాజీనామాలు చేసి, బెంగ‌ళూరుకు దూరంగా ముంబైలో మ‌కాం వేసిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగుర‌వేయ‌డానికి ఆప‌రేష‌న్ క‌మ‌లే ప్ర‌ధాన కార‌ణం.

కుమ్మేసిన కులం

కుమ్మేసిన కులం

క‌ర్ణాట‌క‌లో బ‌లమైన సామాజిక వ‌ర్గం లింగాయ‌త్‌. బీఎస్ య‌డ్యూర‌ప్ప ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే. త‌మ నాయ‌కుడిని ముఖ్య‌మంత్రిగా చూసుకోవాల‌నే బ‌ల‌మైన అకాంక్ష లింగాయ‌త్‌ల‌ల్లో క‌నిపించింది. పైగా - 2008లో అధికారాన్ని కోల్పోయిన య‌డ్యూర‌ప్ప.. ఆవురావురు మంటూ కాచుకుని కూర్చోవ‌డం, ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను చేప‌ట్ట‌డంలో దూకుడును ప్ర‌ద‌ర్శించ‌డం క‌లిసి వ‌చ్చింది.

కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం..

బ‌లం లేక‌పోయినా కుమార‌స్వామి కంటే ముందు య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అధికారంలో ఉన్న‌ది 48 గంట‌లు మాత్ర‌మే. ఇప్ప‌ట్లాగే- త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక విఫ‌లం అయ్యారు. బ‌ల నిరూప‌ణ‌కు వెళ్ల‌క ముందే ప‌ద‌వి నుంచి వైదొలిగారు. ఎలాంటి మొహ‌మాటం లేకుండా ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. వెన్ను చూపాల్సి వ‌చ్చింద‌న్న క‌సి క‌మ‌ల‌నాథుల్లో క‌నిపించింది. ఎలాగైనా అధికారాన్ని అందుకోవాల‌నే త‌ప‌న‌ను నింపింది. కుమ‌ర సర్కార్‌ను కుప్ప‌కూల్చేంత వ‌ర‌కూ తీసుకొచ్చింది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండ‌టం, వెనుక నుంచి చ‌క్రం తిప్ప‌డం లాభించింది.

బెంగ‌ళూరుపై నిర్ల‌క్ష్యం..

బెంగ‌ళూరుపై నిర్ల‌క్ష్యం..

అధికారంలో ఉన్న‌న్ని రోజులూ బెంగ‌ళూరు అభివృద్ధిని ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంది కూట‌మి స‌ర్కార్‌. ప్ర‌భుత్వం ప‌ట్ల తీవ్ర బెంగ‌ళూరియ‌న్ల‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌నే ఫీడ్‌బ్యాక్ ఉన్న‌ప్ప‌టికీ.. ఎప్పుడూ ఫోకస్ పెట్ట‌లేదు ప్ర‌భుత్వం. దీనికి నిద‌ర్శ‌నం.. తిరుగుబాటు జెండా లేవ‌నెత్తిన ఎమ్మెల్యేలు సుమారు ఆరు మంది బెంగ‌ళూరు న‌గ‌ర ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికైన వారే. ఎస్టీ సోమ‌శేఖ‌ర (య‌శ్వంతపుర‌), బైరాతి బ‌స‌వ‌రాజు (కేఆర్ పురం), మునిర‌త్న (రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర‌), రోష‌న్ బేగ్ (శివాజీ న‌గ‌ర‌), గోపాల‌య్య (మ‌హాల‌క్షి లే అవుట్‌)లు న‌గ‌ర ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికైన వారే.

English summary
Chief Minister HD Kumaraswamy on Tuesday lost the trust vote in the Karnataka Assembly that had been put off by the ruling coalition for days. The political crisis was triggered by a string of resignations by lawmakers of the ruling Congress and Janata Dal Secular, reducing the 15-month-old rainbow coalition between two erstwhile rivals, to a minority. Here are the 10 reasons why the HD Kumaraswamy government has collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X