వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిమాండ్ల తీర్చితేనే బిట్టూ అంత్యక్రియలు .. ఫ్యామిలీ, డేరా అనుచరుల అల్టిమేటం, అధికారుల చర్చలు

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీం అనుచరుడు మహిందర్ పాల్ సింగ్ బిట్టు హత్యతో పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుర్మీత్ అరెస్టైన తర్వాత పంచకులలో చెలరేగిన హింసలో ప్రధాన నిందితుడు బిట్టూ పాటియాలా జైలులో ఉన్నాడు. అయితే అతని తోటి ఖైదీలు మొహిందర్‌ను గుర్సేవక్ సింగ్, మనిందర్ సింగ్ అనే ఇద్దరు శనివారం దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అతని మృతదేహన్ని 'నామ్ చర్చా ఘర్'లో ఉంచడంతో డేరా అనుచరులు వచ్చి సందర్శిస్తున్నారు.

ఇవీ డిమాండ్లు ..
పంజాబ్ ప్రభుత్వానికి డేరా అనుచరులు డిమాండ్ల చిట్టా ఇచ్చారు. అవి పరిష్కరించే వరకు బిట్టు అంత్యక్రియలు జరిపించబోమని భీష్మించుకొని కూర్చొన్నారు. దీంతో అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. పంచకులలో హింసాకాండ పేరుతో డేరా అనుచరులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిని మాత్రమే గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. పంచకుల హింసాకాడంలో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో బిట్టూ చనిపోగా .. ఇంకా 25 మంది జైలులో ఉన్నారు.

Tension Prevails in Punjab as Dera Followers Arrive for Last Rites of 2015 Sacrilege Plotter, But Refuse to Cremate Body

కుట్రకోణం ...
బిట్టూ హత్య కుట్రతోనే జరిగిందని అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తున్నారు. గతేడాది ఫరీద్ కోట్ జైలులో బిట్టును ఉంచి .. తర్వాత సభా జైలుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ప్రతీ వారం అక్కడికి వెళ్లి చూసేందుకు దూరం ఎక్కువైందని బిట్టూ .. కుమారుడు అమరిందర్ సింగ్ పేర్కొన్నారు. నభా జైలులో భారీ భద్రత కల్పించడంతోనే అంగీకరించామని .. కానీ తుదకు .. తుదమొట్టించారని వాపోయారు. ఇదిలాఉంటే బిట్టు అంత్యక్రియలు జరిపేందుకు ఫ్యామిలీ మెంబర్స్, డేరా అనుచరులతో చర్చలు జరుపుతున్నామని డిప్యూటీ కమిషనర్ సౌరభ్ రాజ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.

English summary
Uneasy calm prevailed in Kotkapura town of Faridkot district in Punjab on Monday where the mortal remains of Mahinder Pal Singh Bittu, the prime accused in the 2015 Bargari sacrilege case, have been kept inside a Naam Charcha Ghar. Since morning, Dera followers, also known as Premis, continued to pour in huge numbers at Kotkapura to pay obeisance to Bittu, a Dera Sacha Sauda follower who was murdered in Nabha jail on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X