వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రొంబ టెన్షన్.. ఆఖరు నిమిషంలో అద్భుతం జరుగుతుందా? పన్నీర్ సెల్వం ఆశలు ఫలిస్తాయా?

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్దిసేపట్లో అసెంబ్లీలో బల పరీక్ష జరిగి బలాబలాలు తేలిపోనున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొద్దిసేపట్లో అసెంబ్లీలో బల పరీక్ష జరిగి బలాబలాలు తేలిపోనున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామికి 123 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు.

మరోవైపు తిరుగుబాటు చేసిన మాజీ సీఎం పన్నీర్ సెల్వానికి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.

అయితే పన్నీర్ సెల్వం చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందనే ఆశలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ధన్ పాల్ ను కోరారు.

Tension.. Tension.. Will Panneer Selvam's Hope becomes True?

ఒకవేళ స్పీకర్ రహస్య ఓటింగ్ కు అనుమతి ఇస్తే.. తమ వైపు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అలా కాకుండా సాధారణ ఓటింగ్ పెట్టినా కూడా తమవైపు కొందరు ఎమ్మెల్యేలు వస్తారని కూడా వారు పేర్కొంటున్నారు.

ప్రస్తుతానికి తమ లక్ష్యం పళనిస్వామికి మెజారిటీ దక్కకుండా చేయడమే పన్నీర్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. పళనిస్వామి వర్గానికి బలనిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేల కంటే కేవలం ఆరుగురు మాత్రమే ఎక్కువగా ఉన్నారు.

గత పది రోజులుగా శశికళ శిబిరంలో ఉన్న కోయంబత్తూరు నార్త్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ఇవాళ ఉదయం పన్నీర్ వర్గంలో చేరడం కూడా పన్నీర్ వర్గంలో ఆశలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో రహస్య ఓటింగ్ కు స్పీకర్ అనుమతిస్తే పళనిస్వామి వర్గం నుంచి మరికొంత మంది తమ వర్గంలోకి దూకుతారనేది వారి భావన.

అయితే వారిలో కొందరు ఎమ్మెల్యేలు కచ్చితంగా తమ వర్గం వైపు వస్తారని, ఫలితంగా పళనివర్గం బలపరీక్షలో నెగ్గే అవకాశమే లేకుండా పోతుందని పన్నీర్ వర్గం భావిస్తోంది.
మరోవైపు అసెంబ్లీలో ఢీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉండగా, తాము సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఆ పార్టీ నేత స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేను కుటుంబ పాలనలోకి తీసుకెళ్లవద్దంటూ ఎమ్మెల్యేలను కోరుతున్నారు. దీంతో పన్నీర్ వైపు వచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది? బలపరీక్షలో పళనిస్వామి నెగ్గుతారా, లేదా? అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర పడనుంది.

English summary
A floor test in the Tamil Nadu assembly on Saturday is expected to go down to the wire, as chief minister EK Palaniswami’s wafer-thin majority has thrown the exercise wide open. With minutes to go for the trust vote, former CM O Panneerselvam made a last-ditch attempt to woo legislators to his side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X