• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ నేపాల్ సరిహద్దు వివాదం: నేపాల్ భూభాగంలో భారత్ నిర్మాణాలను ఆపెయ్యాలని నేపాల్ డిమాండ్

|
Google Oneindia TeluguNews

భారత్ నేపాల్ దేశాల మధ్య మళ్లీ సరిహద్దు వివాదం రగులుకుంది. భారత దేశ సరిహద్దు ప్రాంతాలైన లింపియా ధురా, లిపు లేక్, కాలాపానీలు నేపాల్ భూభాగంలోని అంతర్భాగమని నేపాల్ పేర్కొంటుంది. ఈ క్రమంలో నేపాల్ తన తూర్పు కాళీ నది భూభాగంలో ఏకపక్ష భారత నిర్మాణాన్ని మరియు రోడ్డు విస్తరణ విస్తరణ పనులను నిలిపివేయాలని భారతదేశాన్ని కోరింది. అంతేకాదు తాము భారతదేశంలో ఉన్న సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతున్నట్లుగా నేపాల్ వెల్లడించింది.

 లిపులేక్ ప్రాంతంలో రహదారుల విస్తరణ పనులు.. మోడీ ప్రకటన

లిపులేక్ ప్రాంతంలో రహదారుల విస్తరణ పనులు.. మోడీ ప్రకటన

నేపాల్ తమది అని చెప్పుకునే లిపులేక్ ప్రాంతం అంతటా రహదారిని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. డిసెంబర్ 30న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌లో నిర్మించిన రహదారిని తమ ప్రభుత్వం మరింత విస్తరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడ రోడ్డు పనులు మొదలుపెట్టింది భారత సర్కార్.

రోడ్ల విస్తరణ పనులను నిలిపివెయ్యాలన్న నేపాల్

రోడ్ల విస్తరణ పనులను నిలిపివెయ్యాలన్న నేపాల్

నేపాల్ సమాచార మరియు ప్రసార మంత్రి మరియు క్యాబినెట్ ప్రతినిధి జ్ఞానేంద్ర బహదూర్ కర్కీ మాట్లాడుతూ, లింపియాధుర, లిపులేఖ్ మరియు కాలాపానీ తూర్పు కాళీ నదితో సహా ఉన్న భూభాగాలు నేపాల్‌లో అంతర్భాగమని, తద్వారా భారతదేశం చేపడుతున్న ఏదైనా రోడ్ల నిర్మాణం లేదా విస్తరణను నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ మరియు భారతదేశం మధ్య సరిహద్దుపై ఏదైనా వివాదాన్ని చారిత్రాత్మక పత్రాలు, మ్యాప్‌ల ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల స్ఫూర్తికి భంగం కలగకుండా నిజమైన పత్రాల ఆధారంగా దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని కార్కీ చెప్పారు.

నిర్మాణం సాగుతుంది భారత భూభాగంలోనే.. భారత్ వెల్లడి

నిర్మాణం సాగుతుంది భారత భూభాగంలోనే.. భారత్ వెల్లడి

కొనసాగుతున్న నిర్మాణం భారత భూభాగంలో ఉందని, అయితే ఏదైనా వివాదాన్ని ద్వైపాక్షిక స్నేహ స్ఫూర్తితో చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భారతదేశం పేర్కొన్న ఒక రోజు తర్వాత నేపాల్ ప్రతిస్పందన వచ్చింది. నేపాల్‌తో సరిహద్దులో భారతదేశం యొక్క స్థానం అందరికీ తెలిసినదని, భారత్ సరిహద్దు విషయంలో స్పష్టమైన వైఖరితో ఉందని , నేపాల్ అంగీకరించిన ప్రాంతాల్లోనే నిర్మాణాలు చేపట్టిందని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు భారత్ లోనే ఉన్నాయని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

భారత్ చేపట్టిన నిర్మాణాలపై నేపాల్ లో ఆందోళనలు, మండిపడిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ

భారత్ చేపట్టిన నిర్మాణాలపై నేపాల్ లో ఆందోళనలు, మండిపడిన నేపాలీ కాంగ్రెస్ పార్టీ

లిపులేక్ లో భారత చేపట్టిన రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా నేపాల్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. లింపియాధురా, లిపులేక్, కాలా పానీ లు నేపాల్ భూభాగాల నేపాలీ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కాలాపానీ ప్రాంతంలో మోహరించిన భారత సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారతదేశాన్ని కోరింది. 1816 నాటి సుగౌలీ ఒప్పందం ఆధారంగానే నేపాల్ భారత్ మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని నేపాలీ కాంగ్రెస్ వెల్లడించింది.

ప్రమాదంలో నేపాల్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలు

ప్రమాదంలో నేపాల్ భారత్ ద్వైపాక్షిక సంబంధాలు

భారతదేశం మరియు నేపాల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న ఏడాదిన్నర తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా గుజరాత్ సమ్మిట్ కోసం భారతదేశాన్ని సందర్శించాలని భావించారు. కోవిడ్ -19 ఉప్పెన కారణంగా గుజరాత్ లో నిర్వహించాలనుకున్న సమావేశం రద్దు అయ్యింది. లేదంటే నేపాల్ పీఎం కు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికేది భారత్ .

అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి, దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా భారత భూభాగంలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ మీదుగా రహదారిని విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన నేపాల్ రాజకీయ వర్గాన్ని ఎదురుదాడికి ప్రేరేపించింది. భారత్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే తాజాగా భారత్ చేపట్టిన నిర్మాణాల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది.

English summary
The border dispute between India and Nepal has flared up again. In this context that India was asked to stop the unilateral Indian construction and road widening works in Lipulek.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X