వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థాన్నే మర్చేసేలా! కాశ్మీర్ పునర్విభజన చట్టంలో అనేక తప్పులు!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి రూపొందించిన పునర్విభజన చట్టాన్ని రాత్రికి రాత్రి రూపొందించారా? దీనిపై కేంద్రం ముందస్తుగా ఎలాంటి కసరత్తు చేయలేదా? అంటే అందులో చోటు చేసుకున్న తప్పులు గానీ, అక్షర దోషాలు గానీ అవుననే సమాధానాన్ని ఇస్తున్నాయి. అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టంలో అనేక అక్షర దోషాలు కనిపించాయి. అర్థాలకు అర్థాలే మారిపోయేంతటి అక్షర దోషాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

వాటిని సవరించబోతోంది. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు దీని బాధ్యతను అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కిందటి నెల 7వ తేదీన పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పునర్విభజన చట్టాన్ని హడావుడిగా తయారు చేసినట్లు అందులోని అక్షర దోషాలు చెప్పకనే చెప్పినట్టయింది.

territories, adminstrator, artcle and 49 other errors corrected in J&K Reorganisation Act

52 ముద్రా రాక్షసాలు..

జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టంలో 49 ముద్రా రాక్షసాలు చోటు చేసుకున్నట్లు కేంద్రం గుర్తించింది. సంవత్సాలకు సంవత్సరాలే మారిపోయిన పేరాలు, పేజీలు చాలానే ఉన్నాయందులో. చాలా పేజీల్లో పదాలు మారిపోయాయి. మరికొన్ని చోట్ల సంవత్సరాలు మారిపోయాయి. వాటిని గుర్తించిన వెంటనే సవరించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు అప్పగించింది. చట్టంలో గుర్తించిన అక్షర దోషాలను సవరించబోతున్నట్లు న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దీనిపై సవరణలతో కూడిన జాబితాతో కూడిన మూడు పేజీల కోరిగెండాను ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ ​లోని లోక్ సభ నియోజకవర్గాలను కూడా పునర్విభజించాలని కేంద్రం తొలుత నిర్ణయం తీసుకున్నట్లు ఈ తప్పుల ద్వారా తేలింది. లోక్ సభ నియోజకవర్గాలను పునర్విభజన సాధ్యం కాలేదు. దీనితో- చట్టంలో ఆ వాక్యాన్ని తొలగించనుంది.

English summary
The legislation of the Jammu and Kashmir Reorganisation Act had over 50 spelling and grammatical errors. After the errors were found the Ministry for Law and Justice issued a three page corrigenda. The legislation was passed by the Parliament on August 7. The legislation paved the way for the abrogation of Article 370 in Jammu and Kashmir. It also declared that Jammu and Kashmir and Ladakh would be made into two Union Territories.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X