వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ హత్య, సోదరుడికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా బలగాలు అడుగడుగునా పహారా కాస్తున్నప్పటికీ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్‌ను కాల్చిచంపారు. అతని సోదరుడిని గాయపరిచారు. బాధితుడి సోదరుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా చోటు చేసుకున్న ఘటనతో మరోమారు కాశ్మీరీ పండిట్ లు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు.

షోపియాన్ జిల్లాలో యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
షోపియాన్ జిల్లాలోని యాపిల్ తోటలో ఈరోజు కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాల్పుల్లో అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
బుద్గామ్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో కాశ్మీరీ పండిట్ హత్యకు గురైన మూడు నెలల తర్వాతమళ్ళీ చోటు చేసుకున్న ఈ ఘటన ఆందోళన కలిగిస్తుంది.
షోపియాన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

షోపియాన్ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

షోపియాన్ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఉగ్రవాదులు హతమార్చిన మృతుడు కాశ్మీరీ పండిట్ 45 ఏళ్ల సునీల్ కుమార్‌గా, అతని సోదరుడిని పింటు కుమార్‌గా భద్రతా బలగాలు గుర్తించారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టారు. గత ఏడాది అక్టోబర్‌ నుంచి కాశ్మీర్‌లో వరుస హత్యలు జరుగుతున్నాయి. బాధితుల్లో చాలామంది వలస కార్మికులు లేదా కాశ్మీరీ పండిట్‌లు. అక్టోబర్‌లో, ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. వారిలో ఒక కాశ్మీరీ పండిట్, ఒక సిక్కు మరియు ఇద్దరు వలస హిందువులు.

కాశ్మీరీ పండిట్ హత్యపై మండిపడిన జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్

కాశ్మీరీ పండిట్ హత్యపై మండిపడిన జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్


ఇక తాజాగా జరిగిన కాశ్మీరీ పండిట్ హత్యపై జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోన్ స్పందిస్తూ, షోపియాన్‌లో పిరికి ఉగ్రవాదులు జరిపిన మరో దారుణమైన దాడి అంటూ మండిపడ్డారు. ఈ హేయమైన హింసాత్మక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను పేర్కొన్నారు

 మోడీ, బీజేపీ సమాధానం చెప్పాలన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

మోడీ, బీజేపీ సమాధానం చెప్పాలన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

కాశ్మీరీ పండిట్లకు భద్రత లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ప్రధాని మోదీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించిన బీజేపీ కి చెందిన మనోజ్ సిన్హా పరిపాలన విఫలమైందని మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్‌లు సురక్షితంగా లేరని, వారు క్షేమంగా ఉంటారని చెప్పి ఆర్టికల్ 370ని తొలగించారని, దీనికి ప్రధాని, హోంమంత్రి, బీజేపీ సమాధానం చెప్పాలని అన్నారు. కాశ్మీరీ పండిట్లందరూ భయంతో జీవిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు

కాశ్మీరీ పండిట్ హత్యను ఖండించిన ఒమర్ అబ్దుల్లా

కాశ్మీరీ పండిట్ హత్యను ఖండించిన ఒమర్ అబ్దుల్లా


ఇక జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ రోజు దక్షిణ కాశ్మీర్ నుండి భయంకరమైన విచారకరమైన వార్త తెలిసిందని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడిలో సంభవించిన కాశ్మీరీ పండిట్ మరణం బాధను మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. షోపియాన్‌లో తీవ్రవాద దాడిలో సునీల్ కుమార్ మరణించారు మరియు పింటో కుమార్ గాయపడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు.

English summary
A terrorist attack took place in Jammu and Kashmir, a Kashmiri Pandit was killed in shopiyan by terrorists in an apple orchard. His brother was also attacked and sustained serious injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X