• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకున్న విద్యార్థులపై ఫిర్యాదు; జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతరులకు ఉగ్రవాద సంస్థ

|
Google Oneindia TeluguNews

ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నందుకు శ్రీనగర్‌లో వైద్య విద్యార్థులపై ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (ULF) హెచ్చరికలు జారీ చేసింది. పోలీసు ఫిర్యాదును ఎవరు దాఖలు చేశారో తమకు తెలుసని, 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, ఫిర్యాదును విత్ డ్రా చేసుకోవాలని, లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని యుఎల్ఎఫ్ తెలిపింది.

జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్; ఐదుగురు సైనికుల మృతితో ఆర్మీకి షాక్!!జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్; ఐదుగురు సైనికుల మృతితో ఆర్మీకి షాక్!!

జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతర ఉద్యోగులు, విద్యార్థులకు యూఎల్ఎఫ్ హెచ్చరిక

జమ్మూ కాశ్మీర్ లో స్థానికేతర ఉద్యోగులు, విద్యార్థులకు యూఎల్ఎఫ్ హెచ్చరిక

విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ల వెనుక ఎవరున్నారో మాకు పూర్తి సమాచారం ఉందని, వారిని వదిలిపెట్టమని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ పేర్కొంది. స్థానికేతర ఉద్యోగులు, విద్యార్థులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నామని ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన తర్వాత కాశ్మీర్ లోయలోని చాలా చోట్ల వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫైర్ క్రాకర్స్ కూడా పేల్చారు. భారత్‌పై పాకిస్థాన్ విజయాన్ని సంబరాలు చేసుకున్నందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వైద్య విద్యార్థులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద రెండు కేసులు నమోదు చేశారు.

 పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న శ్రీనగర్, సాంబాలలో విద్యార్థులపై కేసులు నమోదు

పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న శ్రీనగర్, సాంబాలలో విద్యార్థులపై కేసులు నమోదు

శ్రీనగర్‌లోని కరణ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, స్కిమ్స్ సౌరాలోని హాస్టళ్లలోని విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. సాంబా జిల్లాలో కూడా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానవతా దృక్పథంతో యుఎపిఎ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని జె-కె స్టూడెంట్స్ అసోసియేషన్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరింది.ఈ క్రమంలోనే వారిద్దరిపై కేసులు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో వలస కార్మికులపై దాడికి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ బాధ్యత వహించింది.

 భారత్‌పై పాక్ విజయంతో భారత్ లో సంబరాలు చేసుకున్న వారిపై జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ ఫైర్

భారత్‌పై పాక్ విజయంతో భారత్ లో సంబరాలు చేసుకున్న వారిపై జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ ఫైర్

ఇదిలావుండగా, భారత్‌పై పాక్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్న వారిని ఆ దేశానికి వ్యతిరేకంగా ‘కుట్ర' చేసినందుకు జైలుకు పంపిస్తామని జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అన్నారు. భారతదేశ సమగ్రత మరియు సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే వారు ఎవరైనా సహించేది లేదని, కాశ్మీర్ మరియు ఇతర చోట్ల పాకిస్తాన్ విజయానికి సంబరాలు జరుపుకున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని, దీనిని కుట్రగా భావిస్తున్నామని, పోలీసులు, సిఐడి మరియు వారిపై ఎన్ఐఏ చర్యలు తీసుకుంటోందని, వారందరినీ జైల్లో పెడతామని రైనా అన్నారు.

సోషల్ మీడియాలో సైతం ప్రకంపనలు సృష్టించిన పాక్ చేతిలో భారత్ ఓటమి

సోషల్ మీడియాలో సైతం ప్రకంపనలు సృష్టించిన పాక్ చేతిలో భారత్ ఓటమి

ఇదిలాఉంటే ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి సోషల్ మీడియాలో సైతం ప్రకంపనలు సృష్టించింది. కోహ్లీ సేన ఓటమిపాలైనా దేశంలోని కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై పలువురు క్రికెటర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. దీపావళికి టపాసులు నిషేధించిన ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇవ్వడం వల్లనే టపాసులు కాల్చినట్లుగా పలువురు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయమని పాక్ మంత్రి వెల్లడించారు. భారత దేశంలోని ముస్లింలు కూడా తమవైపే ఉన్నారంటూ అవాకులు చవాకులు పేలారు.

English summary
Some students have complained about students celebrated Pakistan win in T20 world cup match. The police have registered cases against them. The United Liberation Front issued a warning to non-natives in Jammu and Kashmir in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X