చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్ చెన్నె : ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

చెన్నై : మరో నెలరోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం వస్తున్న నేపథ్యంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. చెన్నై కేంద్రంగా దాడులు జరుపాలని వ్యుహరచన చేయగా .. వారి కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ భగ్నం చేసింది. దాడులకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.

 terror groups target chennai ?

కుట్ర భగ్నం
పక్కా సమాచారంతో చెన్నై, నాగపట్టణంలో విధ్వంసానికి ప్రణాళిక రచించిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. విదేశంలో ఉండే అన్సురులా అనే ఉగ్ర ముఠా అండదండలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చెన్నైలో ఉంటున్న సయ్యద్ మహ్మద్ బుఖారి, నాగపట్టనానికి చెందిన హసన్ అలీ యూనుస్ మరికార్, మహ్మద్ యూసుఫుద్దీన్ హ్యరిస్, వారి అనుచరులు దేశంలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు నిధులు సేకరించారని విచారణలో వెల్లడైంది.

ఉగ్ర కుట్ర భగ్నం కావడంతో నిందితులపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐసీపీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. సయ్యద్ బుఖారి, హసన్ అలీ, హ్యరిస్ మహ్మద్ ఇళ్లు, కార్యాలయాల్లో 9 మొబైల్స్, 15 సిమ్ కార్డులు, 7 మొమెరి కార్డులు, 3 ల్యాప్ ట్యాప్‌లు, 5 హర్డ్ డిస్క్‌లు, 6 పెన్ డ్రైవ్‌లు, 2 ట్యాబ్లెట్లు, 3 సీడీలు, పత్రాలు, పుస్తకాలు, బ్యానర్లు, నోటీసులు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
In the months following Independence Day, terrorists tried to create chaos. The National Investigation Agency (NIA) has ruined their conspiracy. All three were taken into custody in connection with the attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X