వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రసాదంలో విషం కలిపి... భక్తులను చంపాలకున్న తీవ్రవాదులు...! ఎక్కడో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

ఇప్పటి వరకు తీవ్రవాదులు పబ్లిక్ స్థలాలు, గుళ్లు,గోపురాల్లో బాంబులు పెట్టడం,వాటిని పేల్చి వందలాదిని మందిని పొట్టనబెట్టుకునే వారు, ఇది వీలు కాకపోతే ఎదురు కాల్పులకు దిగేవారు. కాని ముంబాయిలోని ఓ పురాతన దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో విషం కలిపి భక్తులను చంపడానికి ప్లాన్ వేశారు. ఇందుకోసం ఐఎస్ వద్ద శిక్షణ కూడ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు తీవ్రవాదులను ముందే అరెస్ట్ చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది.

ముబ్రా దేవాలయం ప్రసాదంలో విషం..

ముబ్రా దేవాలయం ప్రసాదంలో విషం..

ముంబాయికి సమీపంలోని ముబ్రా ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల క్రితం నిర్మించిన అతిపురాతనమైన ముబ్రెశ్వర్ ఆలయాం ఉంది. ఇక్కడికి రోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులను చంపేందుకు తీవ్రవాదులు కుట్రలు చేశారు. మహా ప్రసాదంలో విషం కలిపి సుమారు 400 మంది భక్తులను చంపాలని ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడ తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాంబులు పేల్చడంతో పాటు ఇతర తీవ్రవాద కార్యకలాపాలపై కూడ శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ముందే అరెస్ట్ చేసిన ఏటిఎస్ పోలీసులు

ముందే అరెస్ట్ చేసిన ఏటిఎస్ పోలీసులు

ఈనేపథ్యంలోనే తీవ్రవాద కార్యకలాపాలు చేయడంతోపాటు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో గత జనవరిలో ముబ్రా, ఔరంగాబాద్‌కు ప్రాంతాల్లో ఉమ్మాత్ ఏ మహ్మదీయ సంస్థకు చెందిన పది మంది అనుమానితులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారిని విచారణ జరిపారు. విచారణలో తీవ్రవాదులు ఎంచేశారనే విషయాలను బయటకు తీశారు.ఈ నేఫథ్యంలోనే వారిపై కేసులు నమోదు చేసిన ఏటిఎస్ గత వారం క్రితమే ముంబాయి ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ ధాఖలు చేశారు. చార్జీషీటులో పలు ఆసక్తికర అంశాలు తెలిపారు.

ఐసిస్ లో శిక్షణ పోందిన నిందితులు

ఐసిస్ లో శిక్షణ పోందిన నిందితులు

అరెస్ట్ చేసిన తీవ్రవాదులు జాకిర్ నాయక్ ప్రసంగాలతో తీవ్రవాదం వైపు ఆకర్షితులైనట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే జకీర్ నాయక్ ప్రసంగాల వీడియోలను సైతం ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీరు బాంబులు పేల్చడంతోపాటు దేవాలయంలోని ఇచ్చే మహా ప్రసాదంలో విషం కలిపి భక్తులను మట్టుపెట్టేందుకు శిక్షణ కూడ తీసుకున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే ముబ్రా ప్రాంతలో బాంబులను పేల్చి పరీక్షించారని తెలిపారు.

English summary
A group of terror suspects arrested from Mumbra near Mumbai in January were planning to poison the maha prasad given out to devotees at the ancient Mumbreshwar temple, the charge sheet filed by Maharashtra Anti Terror Squad in a Mumbai court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X