వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, రష్యాతో క్షిపణి ఒప్పందంపై చర్చ : అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌తో మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌పై కూడా కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో కూడా కీ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు కీలక అంశాలపై కూడా భాగస్వామ్యం కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలస్తోంది.

కీలక సమావేశం ..
ఇరుదేశాల ద్వైపాక్షి సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో భారత్ విచ్చేశారు. నిన్న సాయంత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ తొలుత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ .. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో వరుసగా మోడీ అవుతారు. వీరి మధ్య రష్యాతో క్షిపణి ఒప్పందం. హెచ్1 బీ వీసా గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి 400 క్షిపణులు కొనుగోలు, ఉగ్రవాదం, వాణిజ్యం గురించి కూడా డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది.

Terrorism, H1B visa, Russia deal on agenda as US secretary meets PM Modi today

టెర్రరిజంపై డిస్కస్ ...
సరిహద్దులో ఉగ్రవాదం, జాతీయ భద్రత గురించి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తావిస్తారు. ఈ మేరకు విదేశాంగ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే వారం జీ 20 సభ్యదేశాల సమావేశం ఉంది. అయితే మైక్ పొంపియో చర్చించిన అంశాల గురించి .. ట్రంప్, మోడీ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యా నుంచి ఎస్ 400 క్షిపణుల కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తోంది.

దీనిపై ఇప్పటికే అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశంలో పాంపే కూడా జై శంకర్, మోడీతో ఈ అంశాన్ని కీలకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు. హెచ్1 బీ వీసా నిబంధనలను సడలించాలని అమెరికాను కోరనుంది. దీనిపై అమెరికా వైఖరి స్పష్టం చేయాలని మోడీ, జై శంకర్ ప్రధాన డిమాండ్ అని విశ్వసనీయ వర్గాల తెలిసింది.

English summary
US Secretary of State Mike Pompeo arrived in India on Tuesday evening and will be holding separate meeting with External Affairs Minister S Jaishankar and later with PM Narendra Modi. While US has continued to assert that the visit will further strengthen India's ties with the US, several contentious topics such as India's missile deal with Russia and H-1B visas will be up for discussion. India's purchase of S-400 missile defence systems from Russia, terrorism, H1B visas, trade and the situation arising out of US sanctions on buying oil from Iran likely to be on the table, along with a host of other issues will be key issues that will be discussed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X