వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్.. కేంద్రంతో టచ్ లోనే ఉన్నాడు: ఫేస్‌బుక్‌లో రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఫేస్‌బుక్‌లోకి వచ్చిన ఆయన.. ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు.

1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని రాజ్ థాకరే తెలిపారు. అంతేకాదు అతన్ని ఇండియాకు తీసుకొచ్చి ఇది తమ విజయంగా బీజేపీ చెప్పుకొనే ప్రయత్నం చేయనుందని కూడా ఆయన చెప్పారు.

Terrorist Dawood Ibrahim 'In Talks' With BJP For His Return, Alleges Raj Thackeray

257 మంది మృతికి కారణమైన ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నాడు. మూడు ఖండాల్లోని 12 దేశాల్లో అతని నెట్‌వర్క్ విస్తరించి ఉంది.

ఫేస్‌బుక్‌లోకి ఇవాళే ఎంటరైన రాజ్ థాకరే.. బీజేపీపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఈవీఎంలను బీజేపీ రిగ్ చేసిందని కూడా ఆరోపించారు. ప్రతి ఓటు బీజేపీకి వెళ్తుంటే.. ఎన్నికల్లో పోటీ చేసి లాభం లేదని ఆయన అన్నారు.

థాకరే ఫేస్‌బుక్‌లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రొఫైల్‌కు 4.39 లక్షల లైక్స్, 4.43 లక్షల మంది ఫాలోవర్లు రావడం విశేషం. పార్టీ కార్యకర్తలతో టచ్‌లో ఉండటానికే ఫేస్‌బుక్‌లోకి వచ్చినట్లు థాకరే చెప్పారు.

English summary
Raj Thackeray dropped a bombshell today as he claimed that India's most wanted terrorist Dawood Ibrahim is trying to negotiate his return with the central government as "he wants to spend his last days" in his home country. The Maharashtra politician claimed that the ruling BJP wants to bring the don back to score in elections. Dawood is "very sick and crippled", said the Maharashtra Navnirman Sena (MNS) chief at a function to mark his Facebook debut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X