వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని కోసం సౌదీ వెళ్తున్నానని చెప్పాడు, కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది తండ్రి అహ్మద్ ఖాన్

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రలో భద్రత దళాల కాల్పుల్లో చనిపోయిన టెర్రరిస్టు సైపుల్లా పనికోసం సౌదీ వెళ్తున్నాని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారం రోజుల క్రితమే ఆయన తన కుటుంబ సభ్యులకు పోన్ చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భద్రత దళాల కాల్పుల్లో చనిపోయిన టెర్రరిస్టు సైపుల్లా పని కోసం సౌదీ అరేబియా వెళ్తున్నట్టు తమతో చెప్పాడని ఆయన తండ్రి సర్తాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు.

సైపుల్లా ఏ పనిచేయకపోతే తాను అతణ్ణి కొట్టానని తండ్రి గుర్తు చేసుకొన్నాడు. ఇంటి నుండి వెళ్ళిపోవాలని కూడ ఆదేశించినట్టు ఆయన చెప్పారు. అయితే నెల రోజుల నుండి తన కొడుకు నుండి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు.

Terrorist killed in UP told his family he was going to Saudi Arabia for work

కాని, వారం రోజుల క్రితం మాత్రం తనకు పోన్ చేసి పని చేసేందుకుగాను సౌదీ అరేబియా వెళ్తున్నానని చెప్పారని ఆయన గుర్తు చేసుకొన్నాడు.అయితే దేశానికి వ్యతిరేకగా పనిచేసిన తన కొడుకు శవాన్ని తీసుకెళ్ళేందుకు తండ్రి అంగీకరించలేదు. పోలీసులు చేసిన పనిని ఆయన సమర్థించాడు.

అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా దళాలు మట్టుబెట్టిన సైపుల్లా అనే తీవ్రవాది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైల్లో బాంబు బ్లాస్ట్ చేసినట్టుగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం నాడు పార్లమెంట్ లో ప్రకటించే అవకాశం ఉంది.. గురువారం నుండి బడ్జెట్ రెండో దఫా సెషన్స్ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చివరి విడత ఎన్నికలకు కొన్ని గంటల ముందే టెర్రరిస్టును పోలీసులు అంతమొందించారు. 12 గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బాంబ్ బ్లాస్ట్ కు పాల్పడిన నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో తలదాచుకొన్నాడు.

అయితే ఆన్ లైన్ ద్వారా సైపుల్లా ఐసిస్ సానుభూతి పరుడిగా మారాడాని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.ఐసిస్ ఆక్టివ్ మ్యాడ్యూల్ గా ఎటిఎస్ అధికారులు భావిస్తున్నారు.

సైపుల్లా తండ్రి ఓ టీచర్,. కాన్పూర్ లోని ఓ స్కూల్ లో ఆయన టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన తన కొడుకు శవాన్ని తీసుకెళ్ళేందుకు ఆయన నిరాకరించాడు.అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైల్లో బాంబు పేలుడు ఘటనకు సంబందించి ముగ్గురేసి చొప్పున ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ నెల 27వ, తేదిన సైపుల్లా బారాబంకీలోని సూఫీ మందిరాన్ని పేల్చివేసేందుకు ప్లాన్ చేశారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

English summary
A 12 hour anti terror operation in a busy Lucknow locality ended early Wednesday when commandos shot dead a suspected terrorist allegedly involved in a train explosion in Madhya Pradesh a day before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X