వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ కు గట్టి ఎదురు దెబ్బ: పీవోకేలో తిరగబడిన ప్రజలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/పీవోకే: పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదుల వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయని పాక్ అక్రమిత కాశ్మీర్ ప్రజలు ఎదురుతిరిగారు. వెంటనే ఇక్కడ ఉన్న ఉగ్రవాద శిక్షణా శిబిరాలను వెంటనే ఖాళీ చేయించాలని ఆందోళనకు దిగారు.

ఉగ్రవాద శిబిరాల కారణంగా మా జీవితాలు నరకంలా మారాయని, వారి దేశ్చేష్టలను ఇక మేము ఏమాత్రం సహించమని స్థానిక పౌరులు ఎదురుతిరిగారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని అంటూ ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

పాక్ అక్రమిత కాశ్మీర్ లోని కోట్లి, చినారి, మిర్ఝూర్ గిల్, నీలం వ్యాలీ, దియామిర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో గురువారం వీధుల్లోకి వచ్చిన పౌరులు పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన బాటపట్టారు.

Terrorist training camps making our life hell: say PoK residents

అంతర్జాతీయ వేదికలపై భారత్ తో గొడవపడిన ప్రతిసారి మా దేశంలో ఉగ్రవాద శిబిరాలు లేవని పాక్ చెబుతూనే వస్తున్నది. అదంతా ఓ బూటకం అని స్థానికులు అంటున్నారు. ఉగ్రవాద శిబిరాల కారణంగా మా జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతున్నాయని ప్రపంచానికి చాటిచెప్పారు.

ఉగ్రవాద సంస్థలను నిషేధించాలని, మాకు బోజనం పెట్టి ఆదుకోవాలని నినాదాలు చేశారు. అంతే కాని ఉగ్రవాదుల చేష్టలకు మమ్మల్ని బలి చెయ్యరాదని ఓ జాతీయ టీవీ చానల్ తో తామ గొడును వెల్లబోసుకున్నారు.

పాక్ అక్రమిత కాశ్మీర్ లో తాలిబన్ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని స్థానిక పౌరులు ఆరోపించారు. పాక్ తీరుపై పీవోకే ప్రజలు మండిపడుతున్నారు. జీవితాంతం తాము ఉగ్రవాద శిబిరాలకు ఆశ్రయం కల్పించలేమని కుండలు బద్దలు కొట్టారు.

English summary
Banned organisations, terror camps are provided food and ration here, we condemn it," a local leader in Muzaffarabad, PoK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X