వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదుల పైశాచికత్వం : ఉనికి కోసం ఆపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు..!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు యాపిల్ తోటలపై ప్రభావం చూపిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత,దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఆపిల్ విక్రయాలు చేపట్టవద్దంటూ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. దీని ద్వార కశ్మీర్ ఆపిల్స్ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి కాకుండా చూడడంతో తమ ఉనికి కాపాడుకోవచ్చనే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సోపియాన్ జిల్లాలోని ఓ ఆపిల్ తోటను సైతం తగులబెట్టారు. దీంతో పంటలను రక్షించేందుకు సైనికులు ఆపిల్ తోటల్లో మోహరిస్తున్నారు.

 కశ్మీరీ యాపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు

కశ్మీరీ యాపిల్ తోటలను కాల్చుతున్న ఉగ్రవాదులు

కశ్మీర్ అపిల్స్ ప్రపంచవ్వాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. ఆపిల్ తోటల పెంపకంతో కశ్మీరీలు తమ జీవోనోపాధితో పాటు వీటి ఉత్పత్తి ద్వార కశ్మీర్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. అందుకే కశ్మీర్ ఆపిల్స్ వ్యాపారం అక్కడి ఉగ్రవాదులు దృష్టిసారించారు. యాపిల్ తోటల యజమానులు తమ తమ తోటలోని పళ్లను రిటైర్లకు అమ్మవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఓ పండ్లతోటకు నిప్పుబెట్టారు. అంతకు ముందు పంపిణికి సిద్దంగా ఉన్న సుమారు 100 పెట్టేల ఆపిల్‌ బాక్సులను కూడ ఉగ్రవాదులు తగులబెట్టినట్టు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు.

ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాద చర్యలు

ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాద చర్యలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ఉగ్రవాదులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఉగ్రవాదుల తోపాటు స్థానిక రాజకీయ పార్టీల నాయకుల్లో ఎలాంటీ చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఎలాంటీ అల్లర్లు సృష్టించకుండా సైనిక వ్యవస్థ అప్రమత్తమైంది. ప్రభుత్వ చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానిక ఉగ్రవాదులు స్థానికులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటీ చర్యలు చేపట్టినా తమ ఉనికిని కోల్పోకుండా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కశ్మీర్‌లో చోటు చేసుకుంటున్నాయి.

ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య నలుగుతున్న ప్రజలు

ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య నలుగుతున్న ప్రజలు

అయితే తోటలను కాల్చుతుండడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సాధరణంగా సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో సైనిక బలగాలు అక్కడ మకాం వేశాయి. దీంతో ఆపిల్ తోటల్లో కూడ తమ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓవైపు ఉగ్రవాదులు మరోవైపు సైనికుల మధ్య నలిగిపోతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఎవరైన వారి ఆజ్ఝాలను దిక్కరిస్తే ప్రాణాలు తీస్తారని స్తానిక ప్రజలు మీడీయాతో వాపోతున్నారు. కనీసం మీడీయాతో కూడ మాట్లాడేందుకు కూడ ముందుకు రాని పరిస్థితులను ఉగ్రవాదులు సృష్టించారు. ఆపిల్స్‌ను రిటైల్ వ్యాపారులకు అమ్మవద్దని చెప్పడంతో దానిపై ఆధారపడిన ప్రజలు సైతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. డబ్బులు సంపాదించుకునే సయమంలో ఇలాంటీ పరిస్థితులు ఎదుర్కోంటున్నామని కార్మికులు వాపోతున్నారు.

English summary
Terrorists in south Kashmir have come up with a new tactic to disrupt livelihood in the region--burning apples.they burnt a huge pile of Kashmir's famous golden apple variety in an orchard in Shopian
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X