వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి కాకుండా ఆకాశం నుండి ఊడిపడుతున్నారా...:ఐరోపా సమాఖ్య

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌‌కు మరోసారి అంతర్జాతీయంగా ఎదురుదెబ్బతగిలింది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో మెజారిటీ దేశాలు భారత్ చర్యలను సమర్ధించారు.తాజాగా ఐరోపా సమాఖ్య కూడ భారత్‌కు మద్దతు పలికింది. చాల సంవత్సరాల సమావేశమైన ఐరోపా దేశాల సమఖ్య కశ్మీర్‌ అంశంపై చర్చ చేపట్టింది.

దాయాది పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్ అంశంలో భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో నిలబెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ దేశానికి మరోసారి షాక్ తగిలింది. కశ్మీర్ లో మానక హక్కులు హరించుకుపోతున్నాయని ఆరోపణలు చేస్తూ ఐరాసకు పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సమావేశం అత్యవసర సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఆశించినట్టుగా ఐరాస దేశాల నుండి మద్దతు లభించ లేదు.

Terrorists came to J-K from neighbouring country, not moon: EU parliamentarian

తాజాగా 12 సంవత్సరాల తర్వాత సమావేశమైన బ్రస్సెల్స్‌లో సమావేశమైన ఐరోపా సమాఖ్య దేశాల సమాశం కొనసాగింది. దీంతో కశ్మీర్ అంశాన్ని చర్చించారు. ఈ నేపథ్యలంలోనే భారత్‌కు మద్దతుగా పలుదేశాలు నిలిచాయి. చర్చలో భాగంగా యూరోపియన్ పార్లెమెంటేరియన్ అయిన రియాజ్ మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ గోప్ప ప్రజాస్వామ్య దేశమని ,భారత్ ,జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు పరిగణలోకి తీసుకొని మద్దతుగా నిలవాల్సిన అవసరముందని అన్నారు.ముఖ్యంగా ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుండి వస్తున్నారు తప్ప ఆకాశం నుండి ఊడిపడడం లేదని పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. దీంతోపాటు కశ్మీర్ అంశం ఇరుదేశాలకు సంబంధించిన అంశమని శాంతీయుత చర్చల ద్వార పరిష్కరించుకోవాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది.

English summary
a member of EU Parliament and Group of European People’s Party in Italy, said Pakistan had threatened to use nuclear weapons which was a concern to the European Union.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X