వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెంపుడు జంతువులే సూసైడ్ బాంబర్లు :విధ్వంసానికి ఉగ్రవాదుల ప్లాన్

పెంపుడు జంతువుల్లో పేలుడు పదార్థాలను అమర్చి విధ్వంసాలను సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని .

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉగ్రవాదులు సరికొత్త పద్దతుల్లో విధ్వంసాలకు రచనలు చేస్తున్నారు. పెంపుడు జంతువులను ఆసరాగా చేసుకొని తమ లక్ష్యాలపై దాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి.

పెంపుడు జంతువులు కుక్క, పిల్లి, కుందేలు వంటి వాటిని సూసైడ్ బాంబర్లుగా ఉపయోగించి విధ్వంసాన్ని సృస్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

దేశంలోని ఢిల్లీ, ముంబాయి, అహ్మాదాబాద్ తదితర ప్రాంతాలతో పాటు రిపబ్లిక్ వేడుకలను దృస్టిలో ఉంచుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

terrorists could use pets as ‘suicide bombers’ for attack on republic day

శీతాకాలం కావడంతో పెంపుడు జంతువులపై ఉన్నిదుస్తులను కప్పుతారు. ఉన్నిదుస్తుల కింద బాంబులను అమర్చుతారు. తమ లక్ష్యానికి చేరువగా పెంపుడు జంతవులు చేరవయ్యేలా చూస్తారు. తమ లక్ష్యానికి చేరువగా పెంపుడు జంతువులు చేరగానే రిమోట్ కంట్రోల్ తో పేల్చనున్నారు.

ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు సిరియాలో తొలిసారిగా చికెన్ బాంబులను ఉపయోగించారు. చికెన్ బాంబులను ఉపయోగించి ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా పేల్చివేశారు.ఇప్పటికే కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలకు ఉగ్రవాదుల కదలికలపై సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది కేంద్ర ఇంటలిజెన్స్ శాఖ.

English summary
terror outfits are known to use suicide bombers for attacks on public places during important events, but in a shift in tactic, the bombers may come in a new form – pets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X