వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుళ్లు పేలిస్తే పూవులు రావు, నేనొచ్చాక 40మంది హతం: టెర్రరిస్ట్‌లకు జమ్ము గవర్నర్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి సత్యపాల్ సింగ్ ఉగ్రవాదులను హెచ్చరించారు. టెర్రరిస్టులు తుపాకీ గుళ్లకు బదులు పూలు ఆశించవద్దని ఎద్దేవా చేశారు. తుపాకీగుళ్లు పేలిస్తే వారికి ఆయువు కూరగాయలు నిలువ చేసే కాలమంత మాత్రమే ఉంటుందని హెచ్చరించారు.

తుపాకీ గుళ్లు పేలిస్తే తుపాకీ గుళ్లే తిరిగి వస్తాయని, ఇది చాలా తేలిక సమీకరణమని ఆయన అన్నారు. తుపాకీ గుళ్లకు బదులు పూల గుత్తులు మాత్రం రావని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల ఆయుష్షు చాలా తక్కువ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి సమాధి స్థితిలో లేదన్నారు.

నేను పదవిలోకి వచ్చిన తర్వాత 40 మంది ఉగ్రవాదులను హతమార్చారని గవర్నర్ చెప్పారు. కాశ్మీర్ లోయలో రాళ్లు విసరడం తగ్గిందని చెప్పారు. యువత ఉగ్రవాదుల్లో చేరడం తగ్గిందని అన్నారు. పరిస్థితులు మరీ అంత ప్రమాదకరంగా లేవని, ఇది సంతృప్తికరమైన విషయమని అన్నారు.

Terrorists should not expect flowers if they fire bullets: Jammu and Kashmir Governor Satya Pal Malik

రాష్ట్రానికి చెందిన 13 నుంచి 20 ఏళ్ల వయస్సు వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ చెప్పారు. ఇక్కడి యువత ఢిల్లీతో పాటు పాకిస్తాన్ పైన కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. హురియత్ లాంటి స్థానిక పార్టీలు ఆశాకిరణంలా కనిపించడం లేదని చెప్పారు. అందుకే యువతతో మమేకమై వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు.

కేంద్రం తమకు అనుకూలంగా లేదని వారు అప్పుడు అర్థం చేసుకుంటారని చెప్పారు. చదువుకున్న వారు కూడా చాలామంది చెడ్డపనులు చేస్తుంటారని, కొందరు ఈ దేశం గురించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ నాలుగు వందల మంది ఉగ్రవాదులు ఉంటారేమో అన్నారు.

చంపాల్సింది ఉగ్రవాదులను కాదని, ఆ భావజాలాన్ని అన్నారు. ఉగ్రవాదం తుపాకీలో నుంచి రాదని చెప్పారు. మెదడులో నుంచి పుడుతుందని అన్నారు. ఇక్కడి యువతలో ఉగ్రవాద భావజాలం చెడిపేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని, ఉగ్రవాద సంస్థల నుంచి కేవలం వినాశనం, మరణం తప్ప ఏదీ లేదన్నారు. భారత్‌ను ముక్కలు చేసే విషయం మరిచిపోండి.. కనీసం ప్రపంచంలో ఒక చిన్న దేశాన్ని కూడా వారు ముక్కలు చేయలేరని హెచ్చరించారు.

English summary
Talking tough on terrorism, Jammu and Kashmir Governor Satya Pal Malik has said militants don't have "much of a shelf life" with more than 40 being killed since August and should not expect bouquets if they fire bullets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X