వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందలకోట్ల నకిలీ కాల్ సెంటర్ల స్కాం: అమెరికన్లకు వలేశారిలా!

|
Google Oneindia TeluguNews

థానే: అమెరికలోని పలువురు సంపన్నులను బెదిరింపులకు రూ. వందల కోట్లలో టోకరా పెట్టిన మహారాష్ట్రలోని థానే నకిలీ కాల్‌సెంటర్లకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. థానేలో ఏర్పాటు చేసిన ఈ నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా.. పన్ను ఎగ్గొట్టినట్లుగా తమ మాటలతో అమెరికన్లను భయపెట్టి, మభ్యపెట్టి వందల కోట్లు కొల్లగొట్టినసంగతి తెలిసిందే.

అతి తక్కువ వ్యవధిలో రూ.500 కోట్ల వరకు కొల్లగొట్టిన ఈ ఉదంతంలో నిందితులు ఎక్కువగా సెర్చ్ వెబ్‌సైట్లనే ఉపయోగించినట్లు తేలింది. దీని ద్వారా పలువురు సంపన్నుల పేరు, చిరునామా తెలుసుకుని.. పన్నులు కట్టడం లేదని వారిని బెదిరింపులకు గురిచేసి కోట్ల వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల దర్యాప్తుల వెలుగు చూసిన అంశాలు..

500కోట్ల కాల్ సెంటర్ స్కాం: ప్రియురాలికి రూ.2.5కోట్ల కారు కానుక

1. నిందితులు తాము టార్గెట్ చేసిన చాలా మందిని ఓ ఇంటర్నెట్ కాల్ ద్వారా సంప్రదించేవారు. వారి ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకుని వారి నుంచి రాబట్టే సొమ్మును నిర్ణయించేవారు. దీన్ని బట్టే వారి బెదిరింపుల తీవ్ర ఉంటుంది.

కొందరు ఈ ఫొన్లకు బయపడి మళ్లీ ఈ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌ల ఫోన్ నెంబర్లనే సంప్రదించేవారు. వారి భయాన్ని ఆసరా చేసుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవారని పోలీసులు తెలిపారు.

2. ఎవరైతే పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగి ఉంటారో వారి వద్ద నుంచి భారీ మొత్తంలో సొమ్మును రాబట్టారని చెప్పారు. ఈ నకిలీ కాల్ సెంటర్ కుంభకోణంలో సాగర్ థక్కర్ అలియాస్ షగ్గీ ప్రధాన నిందితుడు, సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఇతని అనుచరులు వీఓఐపీ కాల్స్‌ను అహ్మదాబాద్ నుంచి చేసేవారు.

Thane call centre scam: People info sites were used to trap victims

3. డైరెక్ట్ ఇన్వార్డ్ డయలింగ్(వీఐడీ) ద్వారా ఈ కాల్స్ ను చేసేవారు నిందితులు. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో ఒకేసారి 10మంది అమెరికన్ పౌరులతో వీరు సంభాషించేవారు.

4. అమెరికా టాక్స్ డిపార్ట‌మెంట్ నుంచే ఈ కాల్స్ వచ్చాయని బాధితులను నమ్మించేలా వ్యవహరించారు ఈ నకిలీ సెంటర్ నిర్వాహకులు.

5. ఈ క్రమంలో తమను అధికారులు అరెస్ట్ చేస్తారనే భయంతో పలువురు అమెరికన్లు తిరిగి నిందితులను సంప్రదించి పెద్ద మొత్తంలో సొమ్మును చెల్లించుకునేవారు.

6.బాధితులు తమ సమస్య నుంచి బయటపడాలంటే తాము చెప్పిన విధంగా చేయాలని ఈ నకిలీ సెంటర్ల నిర్వాహకులు వారికి చెప్పేవారు. వారు సరేనంటే సీనియర్‌కు, లేదా కంపెనీలో కీలకమైన వ్యక్తికి కాల్ బదిలీ చేసేవారు.

7. ఆ తర్వాత బాధితులు ఆ కీలకమైన వ్యక్తి(క్లోజర్) చెప్పిన విధంగా చేసేవారు. బాధితులకు ఫోన్ చేసి వారిని దగ్గరలోని ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ లోకి వెళ్లమని చెప్పేవాడు.

8. అనంతరం ఆ సూపర్ మార్కెట్‌లో ఓ పార్చెస్ గిఫ్ట్ కార్డు కొనమని బాధితులకు క్లోజర్ చెప్పేవాడు. ఆ తర్వాత వారి 16 డిజిట్ నెంబర్లను తమకు పంపించాలని కోరతాడు. దీంతో క్లోజర్ ఆ 16 డిజిట్ నెంబర్లను థక్కర్‌కు పంపుతారు.

9. ఆ తర్వాత థక్కర్ అమెరికాలోని తన వెండర్స్‌కు ఫోన్ చేసి వేల డాలర్ల విలువైన ఆ గిఫ్ట్ కార్డును డిపాజిట్ చేయమని కోరతాడు. అప్పుడు హవాలా ద్వారా ఇతడు ముంబై, అహ్మదాబాద్‌లలో ఆ మొత్తాన్ని అందుకుంటాడని పోలీసులు తెలిపారు.

10. ఈ స్కాం ద్వారా వందల కోట్ల రూపాయలను థక్కర్ సంపాదించాడు.

అక్టోబర్ 4-5తేదీల్లో థానే సమీపంలోని మీరా రోడ్ యూనివర్సల్ ఔట్ స్టాండింగ్ సర్వీసెస్ కేంద్రంతోపాటు ఆరు నకిలీ కాల్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ నకిలీ కాల్ సెంటర్ల బారిన పడిన వేలాది మంది అమెరికన్ల వివరాలను సేకరించారు. కాగా, జూన్ 1 నుంచి అక్టోబర్ 4 మధ్య కాలంలోనే థక్కర్ 18లక్షల డాలర్లను ఒక్క కాల్ సెంటర్ ద్వారా సంపాదించడం గమనార్హం.

ఈ కాల్ సెంటర్ల విలువ రూ. 25-30కోట్ల మేర ఉంటుందని కోర్టుకు విచారణ అధికారులు తెలిపారు. అయితే, మొత్తం స్కాం విలువ భారీ స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కాంలో అరెస్ట్ చేసిన 71మంది నిందితులను పోలీసు అధికారులు విచారిస్తున్నారు.

English summary
Scamsters in the recently busted multi-crore call centre racket+ were using well-known people search websites, which provide a person's name and addresses, to gauge a potential victim's ability to pay as part of their illegal operations, police have revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X