• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన్సుఖ్ హిరెన్ కేసు పత్రాలను ఎన్ఐఏకు అప్పగించాలని ఏటీఎస్ కు థానే కోర్టు ఆదేశం

|

ముఖేష్ అంబానీ కి బెదిరింపు కేసుతో లింక్ అయి ఉన్న స్కార్పియో వాహనం యజమానిగా పోలీసులు విచారించిన మన్సుఖ్ హిరెన్ హత్య కేసులోని అన్ని పత్రాలను అందజేయాలని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఎటిఎస్) కు థానే కోర్టు ఆదేశించింది. మన్సుఖ్ హిరెన్ కేసుకు సంబంధించి అన్ని వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు అప్పగించాలని థానే కోర్టు ఆదేశించింది.

 అంబానీ బెదిరింపు కేసు , మన్సుఖ్ హిరెన్ మృతి కేసు ఎన్ఐఏ కు అప్పగింత

అంబానీ బెదిరింపు కేసు , మన్సుఖ్ హిరెన్ మృతి కేసు ఎన్ఐఏ కు అప్పగింత

బిలియనీర్ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటికి దగ్గరలో ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన స్కార్పియో వాహనాన్ని కనుగొన్న పోలీసులు, ఆ వాహన యజమాని మన్సుఖ్ హిరెన్ గా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే ఊహించని విధంగా మన్సుఖ్ హిరెన్ హత్య గావించ బడ్డారు. ఇక ముకేశ్ అంబానీ బెదిరింపు కేసు కు , మన్సుఖ్ హిరెన్ కేసుకు లింక్ ఉన్న నేపథ్యంలో గత వారం హోం మంత్రిత్వ శాఖ కేంద్ర ఏజెన్సీ అయిన ఎన్ఐఏ కు కేసును బదిలీ చేసింది.

మహారాష్ట్ర ఏటీఎస్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వటం లేదని కోర్టును ఆశ్రయించిన ఎన్ఐఏ

మహారాష్ట్ర ఏటీఎస్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వటం లేదని కోర్టును ఆశ్రయించిన ఎన్ఐఏ


అయితే మహారాష్ట్ర ఎటిఎస్ అవసరమైన ఫైళ్లు, పేపర్లు మరియు కేస్ డైరీలను అందజేయడానికి ఆలస్యం చేస్తున్నట్లు మంగళవారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది. మహారాష్ట్ర పోలీసు చీఫ్ కార్యాలయంతో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారని, అయినప్పటికీ ఏటీఎస్ అధికారుల నుండి తమకు కావాల్సిన సమాచారం లభించలేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. కోర్టుకు తెలియజేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని వారు తెలిపారు.

మన్సుఖ్ హిరెన్ హత్య కేసు కూడా కీలకంగా భావిస్తున్న ఎన్ఐఏ

మన్సుఖ్ హిరెన్ హత్య కేసు కూడా కీలకంగా భావిస్తున్న ఎన్ఐఏ

ముఖేష్ అంబానీ భద్రతకు ముప్పు కేసు ప్రారంభ విచారణలో, వదిలివేసిన పేలుడు పదార్థాలు నిండిన ఎస్‌యూవీ - మహీంద్రా స్కార్పియో - మన్సుఖ్ హిరెన్ కు చెందినది, ఇది ఫిబ్రవరి 17 న దొంగిలించబడిందని పేర్కొన్న తర్వాత మార్చి 5వ తేదీన ఇదేం అనుమానాస్పదంగా మృతి చెందారు. మరణానికి కొన్ని రోజుల ముందు, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ మరియు అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ అయిన పరం బిర్ సింగ్ లకు తన కారు దొంగతనం గురించి తెలుసనీ , జర్నలిస్టులు మరియు పోలీసుల వేధింపులకు పాల్పడ్డారని లేఖ రాశారు.

 మన్సుఖ్ హిరెన్ కేసు విచారణ పత్రాలను ఎన్ఐఏ కు ఇవ్వాలని ఏటీఎస్ కు కోర్టు ఆదేశం

మన్సుఖ్ హిరెన్ కేసు విచారణ పత్రాలను ఎన్ఐఏ కు ఇవ్వాలని ఏటీఎస్ కు కోర్టు ఆదేశం


ఈ కేసులో స్టేట్ ఏజెన్సీ ఏటిఎస్ ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసి కనీసం 25 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. మంగళవారం, సచిన్ వాజేతో సంబంధం ఉన్నట్లు వోల్వో కారును, మన్సుఖ్తో హిరెన్ తో సంబంధం ఉన్న అరెస్టు చేసిన ముంబై పోలీసు అధికారులను సైతం విచారిస్తుంది . హిరెన్ కేసు బాధ్యతలు నిర్వర్తించిన వాజే ,హిరెన్ తో సంబంధాలపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది . ఇక ఈ కేసులో కీలకంగా ఉన్న మన్సుఖ్ హిరెన్ మరణ కేసు ఫైళ్ళను త్వరగా ఎన్ఐఏ కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది .

English summary
A Thane court on Wednesday ordered the Maharashtra Anti-Terror Squad (ATS) to hand over all documents in the Mansukh Hiran death case to the National Investigation Agency (NIA).The case - involving the death of a man said to be the owner of the explosives-filled SUV found near the home of billionaire industrialist Mukesh Ambani earlier this month - had been transferred by the Home Ministry to the central agency last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X