వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థ్యాంక్ గాడ్, ప్యూన్‌ను వదిలేశారు: పిఎన్బీ స్కామ్‌పై మోడీ మీద శతృఘ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై బిజెపి అసమ్మతి ఎంపీ శతృఘ్న సిన్హా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పిఎన్‌బీలో కుంభకోణం నాలుగేళ్లుగా సాగుతున్నా కేంద్రం తెలియనట్టు ఎందుకు వ్యవహరించిందని ఆయన ప్రశ్నించారు.

ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ 11,450 కోట్ల మేరకు ముంచేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి పిఎన్‌బీ ఆడిటర్లే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడాన్ని శతృఘ్న సిన్హా తప్పు పట్టారు.

థాంక్ గాడ్, ప్యూన్‌ను వదిలేశారు

థాంక్ గాడ్, ప్యూన్‌ను వదిలేశారు

సంస్థ ఆడిటర్లను తప్పు పడుతూ, చిన్నచిన్న బ్యాంకు ఉద్యోగులను కూడా నీరవ్ మోడీ కుంభకోణం కేసులో అరెస్టు చేయడాన్ని శతృఘ్న సిన్హా తప్పు పడుతూ - థాంక్ గాడ్... వాళ్లు ప్యూన్‌ను వదిలేశారు అని ట్వీట్ చేశారు.

అదృష్టవశాత్తు వదిలేశారు...

అదృష్టవశాత్తు వదిలేశారు...

మన విద్యావంతులు నెహ్రూ పాలన నుంచి కాంగ్రెసు తప్పుడు పాలన వరకు ప్రతి ఒక్కరినీ నిందిస్తారని, అదే రీతిలో పిఎన్బీ కుంభకోణానికి ఆడిటర్లు రణమని తేల్చారని, అదృష్టవశాత్తు ప్యూన్‌ను వదిలేశారని ఆయన అన్నారు.

మీరేం చేశారని ప్రశ్న

మీరేం చేశారని ప్రశ్న

అసలైన ప్రశ్న ఏమిటంటే పిఎన్బీ నిజమైన యజమాని అయిన ప్రభుత్వం ఏ చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. కుంభకోణం జరిగిన గగత ఆరేళ్లలో నాలుగేళ్ల పాటు ఎన్డీయె అధికారంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వట్టి మాటలు వద్దు

వట్టి మాటలు వద్దు

వట్టి మాటలు చెప్పవద్దని, దోపిడీ ఎందుకు జరిగిందో చెప్పాలని, దోపిడీదారులపై తనకు ఎక్కువగా ఫిర్యాదులు లేవని, నాయకత్వం విశ్వసనీయత ప్రమాదంలో పడిందని ఆయన ఉర్దూలో ట్వీట్ చేశారు.

English summary
BJP MP Shatrughan Sinha tore into his party's government again on Monday, this time poking fun at it for blaming auditor for the PNB scam involving diamantaire Nirav Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X