వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘థ్యాంక్యూ జేఎన్‌యూ’: ఎగిరిన ఐఎస్, పాక్ జెండాలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ శివారు ప్రాంతంలో శుక్రవారం ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం నగరంలో పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్ష పడిన అఫ్జల్‌ గురు మద్దతుదారులకు, భద్రత సిబ్బందికి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

భద్రత సిబ్బందిపై పలువురు రాళ్లు రువ్వారు. ‘థ్యాంక్యూ జేఎన్‌యూ', ‘అఫ్జల్ గురు అవర్ హీరో' అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దాదాపు 200 మంది వరకు ఉన్న ఆందోళనకారులు బ్యానర్లు చేతబట్టి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.

కాగా, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాక పాకిస్థాన్, ఐసిస్ జెండాలు ఎగురవేశారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్‌గురును ఉరితీసిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో అఫ్జల్‌గురుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

English summary
The protesters raised slogans, waved flags and carried "Thank You JNU" posters. Soon after the Friday prayers were over, clashes broke out between the police and protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X