వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థరాత్రి డా.కఫీల్ విడుదల... 'ఎన్‌కౌంటర్ చేయనందుకు ధన్యవాదాలు.. మరో కేసులో ఇరికిస్తారేమో...'

|
Google Oneindia TeluguNews

దేశ ద్రోహం ఆరోపణలతో అరెస్టయి జైల్లో ఉన్న డా.కఫీల్ ఖాన్ అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు విడుదలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జైలు నుంచి బుధవారం అర్ధరాత్రి విడుదలైన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ తీర్పునిచ్చిన న్యాయ వ్యవస్థకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ప్రసంగంలో హింస,విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలేవీ లేవని కోర్టు స్పష్టం చేసింది.

అలాగే నన్ను ముంబై నుంచి మథురకు తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మార్గమధ్యలోనే నన్ను ఎన్‌కౌంటర్ చేయకుండా జైలుకు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు.' అని కఫీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.

మరో కేసులో ఇరికిస్తారేమో....

మరో కేసులో ఇరికిస్తారేమో....

'రామాయణంలో మహర్షి వాల్మీకి ఒక మాట చెప్పారు. రాజ్యాన్ని పాలించే రాజు రాజధర్మానికి కట్టుబడి ఉండాలని. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి అలా లేదు. ఇక్కడ రాజు రాజధర్మాన్ని పాటించకుండా.. మారాం చేసే చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారు.' అని కఫీల్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు,ప్రభుత్వం తనను ఇంకో కేసులో ఇరికించాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విడుదల కోసం గొంతెత్తిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అధికారులు తనను విడుదల చేయడానికి సుముఖంగా లేరని... కానీ ప్రజలందరి ప్రార్థనలతో తాను విడుదలయ్యానని అన్నారు.

విడుదలలో జాప్యం...

విడుదలలో జాప్యం...

కఫీల్ ఖాన్ విడుదలకు ముందు ఆయన తల్లి నుజత్ పర్వీన్ మీడియాతో మాట్లాడారు. 'నా కొడుకు చాలా మంచి వ్యక్తి. దేశం పట్ల,సమాజం పట్ల అతనెప్పుడూ వ్యతిరేకత చూపలేదు. ఎట్టకేలకు నా కొడుకు జైలు నుంచి విముక్తి అవుతున్నందుకు సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నా కొడుకును చూడబోతున్నాను.' అని పర్వీన్ పేర్కొన్నారు.నిజానికి అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత కూడా కఫీల్ ఖాన్ విడుదల గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కోర్టు దిక్కారం కింద జైలు అధికారులపై కేసు వేస్తామని హెచ్చరించారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు అర్థరాత్రి సమయంలో ఆయన్ను విడుదల చేశారు.

Recommended Video

జాతీయ పత్రిక సర్వే.. అగ్ర స్థానం లో Yogi Adityanath | YS Jagan | KCR | Arvind Kejriwal || Oneindia
అలహాబాద్ కోర్టు తీర్పుతో...

అలహాబాద్ కోర్టు తీర్పుతో...

ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో వైద్యుడిగా సేవలందిస్తున్న డా.కఫీల్ ఖాన్ జనవరి 29న అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంపై దేశ ద్రోహం అభియోగాలు మోపుతూ జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన చేసిన ప్రసంగంలో హింస,విద్వేషపూరిత అంశాలేవీ లేవని మంగళవారం(సెప్టెంబర్ 1) అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కఫీల్ ప్రసంగం హానికరంగా ఏమీ లేదన్న కోర్టు.. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఎట్టకేలకు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

English summary
Kafeel Khan, the Uttar Pradesh doctor jailed under the tough National Security Act (NSA) for an alleged speech against the Citizenship (Amendment) Act or CAA, was freed from a jail in Mathura at midnight on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X