వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీతో రెస్టారెంట్లలో తక్కువ ధరకే భోజనం

|
Google Oneindia TeluguNews

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్..జీఎస్టీ దేశ ఆర్థిక రంగంపై మంచి ముద్ర వేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లలో పలు రకాల పేర్లతో పన్నులు విధించే ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది జీఎస్టీ. ఇది వినియోగదారులకు చాలా మేలు చేకూర్చింది. ప్రత్యేకించి మధ్య తరగతి ప్రజలు జీఎస్టీ విధానంతో రెస్టారెంట్లలో ఎంతో లబ్ధి పొందుతున్నారు. రెస్టారెంట్లలో ఇప్పుడు భోజనం చాలా తక్కువకే లభిస్తుంది ఇందుకు కారణం జీఎస్టీ. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై జీఎస్టీ విధించడంతో ధరలు 14.22శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి. గౌహతిలో 23వ జీఎస్టీ సమాఖ్య సమావేశంలో 14.22శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే.... జీఎస్టీ నుంచి వచ్చే లాభాలు రెస్టారెంట్లు తీసుకోవు. ఒకవేళ మద్యం కొనుగోలు చేస్తే దానిపై వచ్చే రాష్ట్ర పన్ను జీఎస్టీ పరిధిలోకి రాదు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లాభాలు కస్టమర్లకు ఇవ్వని కారణంగా రెస్టారెంట్ యజమానులు కూడా ఇందుకు అర్హులు కారని జైట్లీ తెలిపారు. స్టార్ హోటల్స్‌లో మాత్రం 18శాతం స్థిరంగా జీఎస్టీ ఉంటుంది. ఔట్ డోర్ క్యాటరింగ్‌కు కూడా 18శాతం జీఎస్టీ ఉంటుందని తెలిపారు.

Thanks to GST, eating out is a lot more cheaper

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇదొక పరోక్ష పన్ను. ఇది వస్తువులు సేవలపై విధిస్తారు. ప్రతి ఉత్పత్తిపై జీఎస్టీ విధించడం జరుగుతుంది. అయితే అందరికీ తిరిగి చెల్లించబడుతుంది. గూడ్స్ మరియు సర్వీసెస్ ఐదు శ్లాబుల్లో విభజించడం జరిగింది. ఇది 0%,5%, 12%,18 %, 28% లలో విభజించబడింది. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానియాలు, విద్యుత్, లాంటివి కొన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు. వీటికి ప్రత్యేకమైన పన్నులు విధిస్తున్నారు. అది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి.

English summary
The Indirect tax on restaurant has been reduced substantially due to the implementation of Goods and Services Tax (GST). Indeed, a boon for end-consumer, especially, middle-class people in India. Thanks to GST, dining out is a lot more cheaper. With the Goods and Service Tax (GST) levy on both AC and non-AC restaurants has come down to 5 per cent from 14.22 per cent. The GST Council, in its 23rd meeting in Guwahati, had slashed the tax rate from 14.22 per cent to just 5 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X