వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికపై స్పందించిన ఎంపీ బీజేపీ

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతామనే ప్రకటనతో .. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ బీజేపీ చీఫ్ హుటహుటిన ఢిల్లీలో వాలిపోయారు. ఎమ్మెల్యేల తీరుపై ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీలో లుకలుకలు లేవని అధిష్టానం మీడియాకు తెలిపింది.

 నష్ట నివారణ చర్యలు

నష్ట నివారణ చర్యలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ సందర్భంగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శదర్ కోల్ అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వారు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం హస్తం పార్టీలో చేరతామని ముక్తాయించారు. దీంతో బీజేపీ అదేస్థాయిలో స్పందించింది. ఎంపీ బీజేపీ చీఫ్ రాకేశ్ సింగ్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ పార్టీలో చీలికలు, విభేదాలు లేవని తేల్చిచెప్పారు. అందరం కలిసికట్టుగా ఉన్నామని స్పస్టంచేశారు.

తమ చేతుల్లోనే ..

తమ చేతుల్లోనే ..

మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలంతా తమ నియంత్రణలో ఉన్నారని స్పష్టంచేశారు సింగ్. బీజేపీలో గ్రూపులు లేవని .. తమకు అధికార పార్టీతో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టంచేశారు. దీనిపై చర్చించేందుకు ఢిల్లీ వెళారు రాకేశ్ సింగ్. హైకమాండ్ పెద్దలకు ప్రస్తుత పరిస్థితిని వివరించినట్టు విశ్వసనీయంగా తెలసింది. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీని వీడకుండా ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వారిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Recommended Video

తెలుగురాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్
 ఇదీ విషయం ..

ఇదీ విషయం ..

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెందిన నారాయణ్ త్రిపాఠి, శరద్ కోల్ అనే ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీలో ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. వీరిద్దరూ మాజీ కాంగ్రెస్ నేతలే కావడం విశేషం. కానీ రాష్ట్రంలో కమల్ నాథ్ సర్కార్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై .. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. దీంతోపాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కూడా ముఖ్యమేనని స్పస్టంచేశారు. తాము ఘర్ వాపసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు ఆ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

English summary
With the announcement that two MLAs of the Madhya Pradesh BJP will join the Congress, the party has taken corrective measures. MP BJP chief go to Delhi. On the issue of MLAs, Opposition Leader Gopal Bhargava and former CM Shivraj Singh Chauhan discussed the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X