వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవులతో తొక్కించుకుంటే శుభం కలుగుతుందని!: మధ్యప్రదేశ్‌లో ఆచారం..

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 100ఏళ్లుగా ఆ పురాతన సాంప్రదాయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఉజ్జయిని: గోవులతో తొక్కించుకుంటే శుభం కలుగుతుందనేది అక్కడివారి నమ్మకం. ఏటా దీపావళి పండుగ తర్వాత వచ్చే ఏకాదశి నాడు చాలామంది యువకులు గోవులతో తొక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 100ఏళ్లుగా ఆ పురాతన సాంప్రదాయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేవలం మధ్యప్రదేశ్ వాసులే కాదు, ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉజ్జయినికి తరలివెళ్తారు.

That's got to herd! Indian men volunteer to be run over by cows in Hindu ritual said to bestow good luck

ఏకాదశి రోజు గోవులకు రంగులు, దండలతో అలంకరించి, వాటితో తొక్కించే ఏర్పాట్లు చేస్తారు. యువకులంతా వచ్చి నేలపై పడుకుంటే.. గోవులు వాళ్లను తొక్కుకుంటూ వెళ్తాయి. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలివస్తారు. గోవులతో ఇలా చేయించడం ద్వారా తమ ఊరికి కూడా శుభం కలుగుతుందని అక్కడి వారు భావిస్తుంటారు.

అయితే గోవులతో తొక్కించుకునే చాలామంది యువకులు గాయాలపాలు కూడా అవుతుంటారు. వందలాది గోవులు ఒక్కసారిగా వారిని తొక్కుకుంటూ వెళ్లడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యేవారు కూడా ఉంటారు. అయితే అక్కడి గ్రామస్తులు మాత్రం ఇది తమ ఆచారమని చెబుతున్నారు.

English summary
Groups of men in India have voluntarily agreed to be trampled by a herd of cows in a bid to secure future prosperity for themselves and their villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X