• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆహా.. ఎంత అందమైన అమ్మాయిలో..!ఎవ్వరికీ అనుమానం రాకుండా..! షాపింగ్ మాల్ లో ఆ వ్యాపారమా..??

|
  17 మందితో షాపింగ్ మాల్ లో సెక్స్ రాకెట్

  గుర్గావ్/హైదరాబాద్ : భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుందని భావించిన సదరు వ్యక్తి పబ్లిగ్గా ఆ దందా నిర్వహించేందుకు సాహసించాడు. పబ్లిగ్గా అంటే ఆశా మాషీగా కదు ఏకంగా షాపింగ్ మాల్ లోనే దుకాణం ఓపెన్ చేసేసాడు సదరు వ్యాపారి. నిత్యం రద్దీగీ ఉండే షాపింగ్ మాల్ లో ఐతే ఎవరు ఎందుకు ఎక్కడి వస్తున్నారో పసిగట్టడం కష్టమని భావించిన అతడు నేరుగా అక్కడే దందాకు రూపకల్పన చేసాడు. కాని అక్రమంగా నిర్వహిస్తున్న ఏదైనా ఎప్పుడో సారి పోలీసులకు చిక్కకుండా మానదు.

  షాపింగ్ మాల్ లోనే దుకాణం..! స్పా పేరుతో మరో బిజినెస్..!!

  షాపింగ్ మాల్ లోనే దుకాణం..! స్పా పేరుతో మరో బిజినెస్..!!

  అచ్చం ఇలాంటి సంఘటనే హర్యాణాలో చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లో అనుమానం రాకుండా నిర్వహిస్తున్న ఓ సెక్స్ రాకెట్ బాగోతం అకస్మాత్తుగా బయటకు రావడంతో మాల్ లోని మిగతా షాప్ యజమానులు అవాక్కయ్యారు. హర్యానాలోని గురుగ్రామ్‌లోని షాపింగ్‌మాల్‌లో ఓ స్పా సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు ఆ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు. ఇందులో 17మంది అమ్మాయిలు..విటులతో పాటు స్పా సెంటర్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

   స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు..! మరింత స్మార్ట్ గా వ్యాపారం..!!

  స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు..! మరింత స్మార్ట్ గా వ్యాపారం..!!

  ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పేరొందిన షాపింగ్ మాల్ లో స్పా సెంటర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుస్తుందని పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. దీంతో తమకొచ్చిన సమాచారం సరైనదే అని నిర్ణయించుకున్న పోలీసులు ఒక్కసారిగా స్పా సెంటర్‌పై దాడి చేశారు. పోలీసులు దాడి చేసి 7 మంది మహిళలను కస్టమర్లతో అభ్యంతరకరమైన స్థితిలో పట్టుకోగా, 9 మంది బాలికలు స్పా సెంటర్‌లో వేచి ఉన్నట్లు తెలిపారు. అక్కడున్న 17 మంది అమ్మాయిలతో పాటు, మేనేజర్ నిరంజన్ మరియు స్పా సెంటర్ ఆపరేటర్ అలోక్ ను అరెస్ట్ చేశారు.

   వివిధ రాష్ట్రాల నుంచి యంగ్ గల్స్..! అనుమానం రాకుండా షాపింగ్ మాల్ లోనే అన్నీ..!!

  వివిధ రాష్ట్రాల నుంచి యంగ్ గల్స్..! అనుమానం రాకుండా షాపింగ్ మాల్ లోనే అన్నీ..!!

  అయితే ఆ సమయంలో మరో పార్టనర్ గౌరవ్ ఖరే అనే వ్యక్తి అక్కడ లేకపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యభిచారం నిర్వహించేందుకు, పలు ప్రాంతాలకు చెందిన అమ్మాయిల్ని ఇక్కడకు తీసుకొస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అరెస్టు చేసిన యువతులు ఢిల్లీ, తమిళనాడు, మిజోరం, మణిపూర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఢిల్లీ, గురగ్రామ్‌లోనే అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకూ బాగానే ఉన్నా నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్ లో వ్యభిచారం నిర్వహించాలని ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం నిర్వాహకుల తెలివితేటలకు నిదర్శనాలని స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి వ్యాపారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

   అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..! కేటుగాళ్లకు అమ్మాయిలు చిక్కొద్దని సూచన..!!

  అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..! కేటుగాళ్లకు అమ్మాయిలు చిక్కొద్దని సూచన..!!

  రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లో షాపులు కొనుక్కోవడం లేదా లీజుకు తీసుకోవడం చాలా సులభమని, అద్దెలు ఎక్కువగా వస్తుండంతో యజమానులు కూడా ఎలాంటి వ్యాపారం నిర్వహిస్తారో అంతగా పట్టించుకోరని పోలీసులు చెప్పుకొస్తున్నారు. షాపులు అద్దెకు తీసుకునేముందు ఒక వ్యాపారం పేరు చెప్పి షాపులో దిగిన తర్వాత ఇలాంటి అసాంఘీక కార్యక్రమాలకు కొందరు పాల్పడతారని హర్యాణా పోలీసులు అంటున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండక పోతే సాధారణ జనావాసాల్లో కూడా ఇలాంటి వ్యాపారాలు నిర్వహించి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఇక ముందైనా ఇలాంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడ పిల్లలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇలాంటి స్పా సెంటర్లకు వెళ్తే శ్రేయస్కరమని పోలీసులు చెప్తున్నారు.

  English summary
  An unknown person informs the police that a sex racket is running under the name of Spa centre in a so-called shopping mall. The police held a patrol in the area. The police attacked and grab 7 women in an objectionable position with customers, while 9 girls were told to wait in the spa centre. Along with 17 girls present, manager Niranjan and Spa centre operator Alok were arrested.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more