వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడి

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-శివసేన అధికారాన్ని పంచుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించనున్నాయి. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఈ విషయాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన తరువాత వారిద్దరూ ముంబైలో వేర్వేరుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 50-50 ఫార్ములాపై ఓ అవగాహనకు వచ్చామని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.

అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీఅతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీ

గురువారం ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ-శివసేనకు అనుకూలంగా వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. ఈ రెండు పార్టీలు కలిస్తే.. మ్యాజిక్ ఫిగర్ ను అవలీలగా అందుకోగలుగుతాయి. శివసేన మద్దతు లేనిదే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యం. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. ఈ 50-50 ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చారు. దానికే కట్టుబడి ఉన్నారు.

The 50-50 formula was decided, says Shiv Sena chief Uddhav Thackeray

ఈ విషయం మీదే శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్.. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించారు. సుమారు రెండు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది. చాలా అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. 50-50 ఫార్ములాకు అంగీకరించకపోతే.. తమ దారి తాము చూసుకుంటామని కూడా శివసేన హెచ్చరించినట్లు ప్రారంభంలో వార్తలు వచ్చాయి. శివసేన మద్దతు లభిస్తే కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో శివసేన కొన్ని డిమాండ్లను బీజేపీ పెద్దల వద్ద ఉంచింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం దీనికి బీజేపీ అంగీకరించింది.

ఈ విషయాన్ని ఒకవైపు ఉద్ధవ్ థాక్రే.. మరోవైపు దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. అధికారాన్ని పంచుకోవాలని తాము నిర్ణయింకున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తొలి అర్ధభాగం బీజేపీ నాయకుడు.. మలి అర్ధభాగం శివసేన నేత ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠిస్తారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది ఇంకా తేలాల్సి ఉందని ఉద్ధవ్ థాక్రే ట్విస్ట్ ఇవ్వడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. శివసేన తరఫున ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉంటారా? లేక ఆయన కుమారుడు ఆదిత్య థాక్రే సీఎం పీఠంపై కూర్చుంటారా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Shiv Sena chief Uddhav Thackeray: Being his father I am proud of him. I am happy that the people gave him so much love. The 50-50 formula was decided. Discussions should be held and then it should be decided that who would be the Chief Minister of Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X