వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ చరిత్ర తిరగ రాస్తారా?!: కన్నడిగులు రెండోసారి ‘పవర్’ ఇస్తారా?!!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం.. మూడు దశాబ్దాలుగా కన్నడనేలపై సాగుతున్న ఎన్నికల రాజకీయాన్ని తిరగరాయాలని కలలు కంటోంది. అవును మరి 1989 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చివరి అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు నెలకొల్పాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు.
రాజకీయ వేడికి నిలయమైన వింధ్య పర్వతాలకు దక్షిణ దిశగా ఉన్న కర్ణాటకలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 'సమర భేరి' మ్రోగించింది. మే 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఫలితాలు వెలువడతాయని ప్రకటించింది. రాజకీయంగా అత్యంత గణనీయ ప్రభావం చూపే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

కన్నడిగుల మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీలు సమాయత్తం

కన్నడిగుల మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీలు సమాయత్తం

ఇప్పటికే యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత రెండు నెలలుగా కర్ణాటక రాష్ట్రమంతటా కలియదిరుగుతున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదే స్థాయిలో కమలనాథుల పట్ల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1989 తర్వాత వరుసగా ఏ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంప్రదాయం లేదు. కానీ దాన్ని తిరుగరాయాలని సిద్దరామయ్య కలలు కంటున్నారు.

కన్నడిగుల నేలపై రాజకీయాలకు ఆరు రీజియన్లు కీలకం

కన్నడిగుల నేలపై రాజకీయాలకు ఆరు రీజియన్లు కీలకం

ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కర్ణాటకను ‘చే'జిక్కించుకునేందుకు సుదీర్ఘ కాలంగా వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్నాయి. కన్నడ నేల ఆరు రీజియన్లుగా విడిపోయి ఉండటంతోపాటు మిగతా రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలోనూ స్వంతంగా కుల సమీకరణాలు ఎన్నికల సమరాంగణంలో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రీజియన్ల పరిధిలో రెండు పార్టీలకు సానుకూలత, ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

వొక్కలిగ సామాజిక వర్గమూ కన్నడ పాలిటిక్స్ కీలకమే

వొక్కలిగ సామాజిక వర్గమూ కన్నడ పాలిటిక్స్ కీలకమే

ఓల్డ్ మైసూర్ రీజియన్ రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ రీజియన్ కావడమే కాదు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కూడా. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ 40 సీట్లకు 30 కైవసం చేసుకున్నది. మిగతా 10 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకున్నది. ఈ రీజియన్ పరిధిలో వొక్కలిగ సామాజిక వర్గం ప్రభావమే చాలా ఎక్కువ. తొలి నుంచి వొక్కలిగలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజాదరణ గల నాయకుడు మాజీ సీఎం ఎస్ ఎం క్రుష్ణ (85)కు ఈ ప్రాంత బలం, బలహీనతలు కొట్టిన పిండి.

బీజేపీ - జేడీఎస్ కూటమితో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చిల్లు?

బీజేపీ - జేడీఎస్ కూటమితో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చిల్లు?

గతేడాదే బీజేపీలో చేరిన ఎస్ఎం క్రుష్ణ వల్ల ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కమలనాథులకు లబ్ధి చేరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతోపాటు జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల వాటాను స్వాహా చేసేసి సీట్లను కొల్లగొట్టాలని కాచుక్కూర్చున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నా.. బీజేపీ - జేడీఎస్ కలిసి పోటీ చేస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బ తింటుందేమోనని ఆందోళనకు గురవుతున్నది.

2013లో కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలతో బీజేపీ ఇలా

2013లో కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలతో బీజేపీ ఇలా

హైదరాబాద్ -కర్ణాటక రీజియన్‌లో బీజేపీ నేతలు రెడ్డి బ్రదర్స్ కు తిరుగులేని పట్టు ఉన్నది. భారీ స్థాయిలో లింగాయత్‌లు ఉన్నారు. 2013లో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, కమలనాథులపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు, బళ్లారిలో ప్రతికూల పరిస్థితుల్లో కమలనాథులు దెబ్బ తిన్నారు. కానీ ఈ దఫా కమలనాథులంతా ఐక్యతా రాగం ఆలాపిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు సిద్దమవుతున్నారు. కాకపోతే లింగాయత్ సామాజిక వర్గానికి ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తూ సిద్దరామయ్య క్యాబినెట్ కేంద్రానికి చేసిన సిఫారసు వల్ల కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కర్ణాటకలో లింగాయత్‌లు 19% జనాభా

కర్ణాటకలో లింగాయత్‌లు 19% జనాభా

కన్నడ నేలపై లింగాయత్‌లు రాజకీయంగా శక్తిమంతులు. ఓబీసీ హోదా కలిగి ఉన్న లింగాయత్ ల జనాభా కర్ణాటకలో ఎక్కువ. ఈ ప్రాంతంలో లింగాయత్ ల జనాభా 11.5 నుంచి 19 శాతంగా ఉంటుంది. కేవలం హైదరాబాద్ -కర్ణాటక రీజియన్ వరకు మాత్రమే లింగాయత్ సామాజిక వర్గం జనాభా పరిమితమై లేదు. పలు రీజియన్లలో విస్తరించి ఉన్న లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో సుమారు సగం సెగ్మెంట్ల పరిధిలో విజయావకాశాలను శాసించగల సత్తా ఉన్నవారే కావడం గమనార్హం.

2013లో ఒక్క సీటులో మాత్రమే బీజేపీ గెలుపు

2013లో ఒక్క సీటులో మాత్రమే బీజేపీ గెలుపు

ఇక కర్ణాటక కోస్తా తీర ప్రాంతం బీజేపీకి నిద్రలేని రాత్రిళ్లు మిగిల్చింది. ఉడుపి జిల్లాలోని ఐదు సీట్లలో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న కమలనాథులు.. దక్షిణ జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో ఖాతానే తెరవలేదు. కానీ సమీకరణాలు మారిపోయిన పరిస్థితుల్లో బీజేపీకి అత్యంత సానుకూల ప్రాంతం కోస్తా. కోస్తా ప్రాంతంలో ఉత్తర కర్ణాటక, ఉడుపి, చిక్ మంగళూరు జిల్లాల పరిధిలో 24 స్థానాలు ఉన్నాయి. మతతత్వ రాజకీయాల ప్రచారం బీజేపీకి లాభిస్తుందన్న మాట కూడా వినిపిస్తున్నది.

సెంట్రల్ కర్ణాటకలో 32 స్థానాలకు రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు

సెంట్రల్ కర్ణాటకలో 32 స్థానాలకు రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచి పెట్టేసిన రీజియన్ సెంట్రల్ కర్ణాటక. ఈ రీజియన్ పరిధిలోని 32 స్థానాల్లో కేవలం రెండే రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. తూంకూరు, దవణగిరె, చిత్రదుర్గ, షిమోగ జిల్లాల పరిధిలో తిరిగి పట్టు సాధించే లక్ష్యంతో బీజేపీ పని చేస్తూ మరింత విశ్వాసాన్ని ప్రోది చేసుకుని ముందుకెళుతున్నది. ఇక గత ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ ఈ దఫా విస్తరణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2013లో షిమోగా నుంచి 3.5 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యతతో విజయం సాధించిన బీఎస్ యెడ్యూరప్ప ఈ దఫా కర్ణాటక సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు.

లింగాయత్‌లకు మైనారిటీ హోదా జిమ్మిక్కని బీజేపీ ప్రచారం

లింగాయత్‌లకు మైనారిటీ హోదా జిమ్మిక్కని బీజేపీ ప్రచారం

లింగాయత్ సామాజిక వర్గం ఆధిపత్యం గల రీజియన్ ‘ముంబై- కర్ణాటక'. లింగాయత్ సామాజిక వర్గానికి మైనారిటీ మత హోదా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘ఎన్నికల జిమ్మిక్కు' అని ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ప్రచారంతోనే ముంబై - కర్ణాటక రీజియన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించాలని కమలనాథులు వ్యూహాలు రూపొందించారు. లింగాయత్ సామాజిక వర్గ నాయకుడైన బీఎస్ యెడ్యూరప్ప.. తమ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంతో సొంతంగా ఏర్పాటు చేసిన కర్ణాటక జనతా పక్ష పార్టీతో 2013లో బీజేపీని 40 స్థానాలను పరిమితం చేయ గలిగారు. తర్వాత కర్ణాటక జనతా పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

ప్రధాని మోదీ ప్రచారానికి బీజేపీ వ్యూహం ఇలా

ప్రధాని మోదీ ప్రచారానికి బీజేపీ వ్యూహం ఇలా

బీజేపీకి సంప్రదాయంగా పెట్టని కోటగా ఉన్న రాష్ట్ర రాజధాని బెంగళూరు. 2013లో బెంగళూరు రీజియన్ పరిధిలోని 28 స్థానాల్లో 17 చోట్ల బీజేపీ గెలుపొందింది. అంతకుముందు 2008లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా ఓట్ల వర్షం కురిపించిందీ బెంగళూరు రీజియన్ అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో రెండు వారాల పాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసేందుకు వ్యూహ రచన చేశారు. అత్యధికంగా మోదీ ప్రభావంతో ఓట్లు, సీట్లు కొల్లగొట్టాలని కల కంటున్నారు కమలనాథులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అభివ్రుద్ధి నినాదంతో ఉన్నత కులాలు, మైనారిటీల ఓట్లతో సీట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది.

English summary
New Delhi: The dates for Karnataka Assembly polls have just been announced. Votes will be polled on May 12 and counting will be held on May 15 in what is arguably the most politically significant state south of Vindhyas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X