వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ మారుతోంది.. ప్రశాంతంగా శుక్రవారం ప్రార్థనలు.. రేపటినుంచి 144 సెక్షన్ తొలగింపు

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లో నేడు ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సడలించడంతో ,ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు నేడు తెరుచుకున్నాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఊహించినట్టు ఎలాంటీ హింసాయుత సంఘటనలు చోటు చేసుకోలేదు. పరిస్థితి అదుపులో ఉండడంతో శనివారం నుండి పలు విద్యాలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడ తొలగిస్తున్నట్టు భద్రతా అధికారులు ప్రకటించారు.

ఆర్టికల్ తొలగింపుతో కశ్మీర్‌లో ఉత్కంఠ

ఆర్టికల్ తొలగింపుతో కశ్మీర్‌లో ఉత్కంఠ

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన కశ్మీర్‌ లోయ అంత్యంత కట్టుదిట్టమైన భద్రతలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలోనే ఎప్పుడు ఎలాంటీ సంఘటనలు జరుగుతాయో అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. అయితే అందరు ఊహించినట్టుగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం కర్ఫ్యూ విధించింది. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈనేపథ్యంలోనే మూడు రోజుల పాటు అద్యంతం ఉత్కంఠ నెలకోంది. అయితే కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు కేంద్రం పలు భద్రతా నిబంధనలు సడలించింది.

శుక్రవారరం కర్ఫ్యూ సడలింపు

శుక్రవారరం కర్ఫ్యూ సడలింపు

మరో మూడు రోజుల్లో బక్రీద్ పండగ ఉండడంతో పాటు నేడు శుక్రవారం కావడంతో కర్ఫ్యూను సడలించారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాలు రీ ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో మూడు రోజుల పాటు ఉత్కంఠ పరిస్థితుల్లో ఉన్న కశ్మీర్ నేడు సాధరణ పరిస్థితుల్లోకి చేరుకుంది. శుక్రవారం కావడంతో ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుకున్నారు. మరోవైపు విద్యార్థులు సైతం స్కూళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుండి ఎక్కడ హింసాయుత సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం నుండి 144 సెక్షన్ తొలగింపు

శనివారం నుండి 144 సెక్షన్ తొలగింపు

మరోవైపు శనివారం నుండి విద్యాలయాలు,పబ్లిక్ ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ కూడ ఎత్తి వేయనున్నట్టు ప్రకటించారు. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థను కూడ మెరుగు పరిచినట్టు తెలుస్తోంది. మూడు ప్రభుత్వ చానల్ల ప్రసారాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. కశ్మీర్ వ్యాలీలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో సైతం నిబంధలు సడలించడంతో అక్కడ ఎలాంటీ ఇబ్బందులు లేకుండా ప్రజలు సాధరణ జనజీవనాన్ని కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

కర్ఫ్యూ తర్వాత ఆందోళన అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్

కర్ఫ్యూ తర్వాత ఆందోళన అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్

ఇక కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులపై దాయాది పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ప్రకటనటు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే
కేంద్రబలగాల ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఇప్పుడు బాగానే ఉంది, అసలు విషయం ముందుంది అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. కర్ఫ్యూ సడలించిన తర్వాత జరిగే పరిణామాలపైనే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. కేంద్ర బలగాల ఆధిదపత్యంతో బీజేపీ ప్రభుత్వం విజయం సాధించామని భావిస్తుందని పేర్కోన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ భావించినట్టుగా కర్ఫ్యూ సడలించిన ఎలాంటీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Jammu and Kashmir on Friday eased several restrictions,state limped back to normalcy following revocation of Article 370, ప్రశాంతంగా కోనసాగిన ముస్లింల ప్రార్థనలు, చిన్న పిల్లలు సైతం ఉత్సహాంగా స్కూళ్లకు వెళ్లిన వైనం, 144 సెక్షన్ తొలగించనున్న ప్రభుత్వం.కశ్మీర్ లోయలో భద్రతా నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X