వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2021లోనే కశ్మీర్ ఎన్నికలు ...? డీలిమిటేషన్ ప్రక్రియ ఆలస్యం

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఆక్టోబర్ 31 నుండి అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగనుంది. కొత్తగా ఎర్పడిన కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం 10 నుండి 15 నెలల కాలం పడుతుందని ఎన్నికల కమీషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం బ్లూప్రింట్‌ను కూడ సిద్దం చేసినట్టు సమచారం. దీంతో కశ్మీర్‌లో సాధరణ ఎన్నికలు 2021 సంవత్సరంలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాల సమాచారం.

అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన అమిత్ షా

అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన అమిత్ షా

కశ్మీర్ పునర్విభజనలో భాగంగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటయిన విషయం తెలిసిందే.. ప్రస్థుత కశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతుండగా... అక్టోబర్ 31 నుండి పూర్తిస్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోకి వెళ్లనుంది. మరోవైపు ఇప్పటికే రెండు సార్లు గవర్నర్ పాలనను కేంద్రం పోడగించిన విషయం తెలిసిందే, నేపథ్యంలోనే స్థానిక పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే గవర్నర్ పాలన పోడిగించే సమయంలోనే, త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో హమి ఇచ్చాడు. అది కూడ ఆక్టొబర్ లేదా నవంబర్‌లో నిర్వహిస్తామని సంకేతాలు ఇచ్చారు.

కశ్మీర్‌లో ఎన్నికలపై ఎన్నికల సంఘం చర్యలు

కశ్మీర్‌లో ఎన్నికలపై ఎన్నికల సంఘం చర్యలు

అయితే ప్రభుత్వం భావించినట్టుగా రానున్న రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. జమ్ము కశ్మీర్ పునర్వీభజన చట్టం ప్రకారం ప్రస్థుతం ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యులు, సీట్ల పెంపుతోపాటు డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు గతంలోనే సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి ఇటివల కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్విభజన చట్టాలను కూడ పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ సంధర్భంలోనే గతంలో ఏర్పడ్డ ఉత్తరాఖండ్ ఎర్పాటు తర్వాత జరిగినన డీ లిమిటేషన్ ప్రక్రియను సైతం పరీశించారు.

డీలిమిటేషన్ ప్రక్రియలో ,ఏడు అసెంబ్లీ స్థానాల పెరిగే అవకాశం..

డీలిమిటేషన్ ప్రక్రియలో ,ఏడు అసెంబ్లీ స్థానాల పెరిగే అవకాశం..

1995లో కశ్మీర్‌ అసెంబ్లీ పునర్విభజన ప్రక్రియ జరిగింది. దీంతో అక్కడ మొత్తం 111 స్థానాలు ఉన్నాయి. ఇందులో నాలుగు సీట్లు లద్దాక్ ప్రాంతంలో ఉన్నాయి.. ప్రస్తుతం లద్దాక్ ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. కశ్మీర్‌లో ప్రస్థుతం ఉన్న 107 స్థానాలు ఉన్నాయి వీటికి అదనంగా మరో ఏడు సీట్లు పెరగనున్నాయి. ఏడు సీట్ల పెంపుతో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 114 కు చేరనుంది. వాటిలో 24 సీట్లు పీఓకే ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండు దశబ్దాల తర్వాత కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం కనీసం సంవత్సరం కాలం పట్టనున్న నేపథ్యంలోనే 2021లోనే కొత్త అసెంబ్లీ కొలువుదీరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

English summary
The assembly election in Jammu and Kashmir is likely to be held in 2021 following the delimitation of parliamentary and assembly constituencies of the newly formed Union Territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X