వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐఎం స్టూడెంట్స్‌కు కలాం అసైన్‌మెంట్ ఇదే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉభయ సభలను అడ్డుకునే చర్యలకు స్వస్తి చెప్పడానికి కొత్త ఆలోచనలను తెలియజేయాలని ఐఐఎం విద్యార్ధులకు అసైన్మెంట్ ఇవ్వాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనకు సన్నిహితుడైన శ్రీజన్‌ పాల్‌ సింగ్ తెలిపారు.

కలాంకు అత్యంత సన్నిహితుడు, ఆయనతో పాటు ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణించిన శ్రీజన్ పాల్ సింగ్ వెల్లడించారు. మార్గమధ్యలో కలాం తనతో మాట్లాడుతూ పార్లమెంటు సక్రమంగా జరగకపోవడం పట్ల ఆవేదన చెందారని ఆయన మంగళవారం తెలిపారు.

The assignment which Dr A P J Abdul Kalam could not give to IIM Shillong students

అయితే అబ్దుల్ కలాం ఐఐఎం విద్యార్ధులకు ప్రసంగం అనంతరం వారిని ఆశ్చర్యపరిచే ఓ అసైన్‌మెంట్‌ ఇద్దామనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, ఆయనతో పాటు షిల్లాంగ్‌కు ప్రయాణించిన శ్రీజన్‌ పాల్‌ సింగ్‌ వెల్లడించారు.

గత వారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగకపోవండం పట్ల ఆవేదన చెందిన కలాం, పార్లమెంటు సక్రమంగా జరగడానికి మూడు వినూత్న ఐడియాలను తెలియజేయాలని విద్యార్థులకు అసైన్‌మెంట్‌ ఇవ్వాలనుకున్నారని కలాం చెప్పినట్లు శ్రీజన్‌ పాల్‌ తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో విడుదల చేయనున్న 'అడ్వాంటేజ్ ఇండియా' పుస్తకంలో పార్లమెంట్ సెషన్స్‌పై కొన్ని అంశాలను చేర్చామని తెలిపారు. కలాం చివరి కోరిక ఏమిటని అడగ్గా, అందరి ముఖాల్లో చిరు నవ్వులు ఉండాలనేది ఆయన కోరికని పేర్కొన్నారు.

సోమవారం షిల్లాంగ్ ఐఐఎంలో 'లివింగ్ ప్లానెట్' అనే అంశంపై ప్రసంగిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను షిల్లాంగ్‌లోని ఎస్పీ ఖాసీ హిల్స్‌లోని ఎం ఖర్కరంగ్ ఆస్పత్రికి తరలించడం, చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Working tirelessly even on his last day, Dr APJ Abdul Kalam had planned a surprise assignment for the students of IIM Shillong on finding innovative ways to end disruption in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X