వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంతం నెగ్గించుకున్న విద్యార్థులు... ముస్లిం ప్రోఫెసర్‌ను తప్పించిన యూనివర్శిటి

|
Google Oneindia TeluguNews

హిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన వివాదానికి యూనివర్శిటీ అధికారులు ఫుల్‌స్టాప్ పెట్టారు. సంస్కతం డిపార్ట్‌మెంట్‌లో ఫ్రోఫెసర్‌గా చేరిన ముస్లిం ఫ్రోఫెసర్ ఫిరోజ్ ఖాన్‌ను తప్పించారు. గత పదిరోజులుగా యూనివర్శిటి విద్యార్థులు ఆందోళన బాటపట్టడడంతో ఆయన దాన్ని నుండి తప్పుకున్నారు. అయితే అదే యూనివర్శిటిలో ఇతర ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సంస్కృతం సబ్జెక్టును భోదించేందుకు యూనివర్శిటి అధికారులు, విద్యార్థుల మధ్య ఒప్పందం కుదిరింది.. దీంతో యూనివర్శిటీలో చెలరేగిన ఆందోళనలకు ఫుల్‌స్టాప్ పడింది.

 ఈ సంస్కృతం ప్రోఫెసర్ ఎవరు

ఈ సంస్కృతం ప్రోఫెసర్ ఎవరు


వారణాసిలోని బనారస్‌ హిందు యూనివర్శిటీలో సంస్కృత డిపార్ట్‌మెంట్‌లో ఓ ముస్లిం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను యూనివర్శిటి ఎంపీక చేసంది. దీంతో ఓ ముస్లిం వ్యక్తి సంస్కృతం ఎలా చెబుతాడంటూ... ఆయనకు వ్యతిరేకంగా గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ఫిరోజ్‌ ఖాన్‌ అనే ముస్లిం ఫ్రోఫెసర్... ఈ సంవత్సరం నవంబర్ అయిదున సంస్కృత అస్టిస్టెంట్ ప్రోఫెసర్‌గా బనారస్‌ యూనివర్శిటీలో చేరారు. తెలుగు వారికన్నా బాగా సంస్కృతం చెబుతున్నారన్న మంచి పేరు కూడా ఫిరోజ్ ‌ఖాన్‌కు ఉంది. మరోవైపు ఆయన రాజస్థాన్‌ ప్రభుత్వం నుంచి ‘సంస్కృత్‌ యువ ప్రతిభా సమ్మాన్‌'ను కూడా అందుకున్నారు. కాగా యూనిర్శిటీ ఎంపీకలో మొత్తం 11 మందిని ఇంటర్వ్యూచేసిన బనారస్‌ విశ్వవిద్యాలయం అధికారులు ఫిరోజ్‌ ఖాన్‌ను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు.

ముస్లిం సంస్కృతం, హిందూ పురాణాలు ఎలా బోధిస్తాడు...?

ముస్లిం సంస్కృతం, హిందూ పురాణాలు ఎలా బోధిస్తాడు...?

కాగ ముస్లిం వ్యక్తి తమకు సంస్కృతం బోధించడం ఏమిటని, అందులోనూ హిందూ పురాణాల గురించి చెప్పడం ఏమిటంటూ యూనివర్శిటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో ఫిరోజ్‌ ఖాన్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించే వరకు తాము తరగతులకు రామంటూ భీష్మించుకొని బహిష్కరణకు దిగారు. ఫిరోజ్‌ ఖాన్‌కు అండగా నిలబడిన బనారస్‌ యూనివర్శిటీ అధికారులు, విద్యార్థులకు శతవిధాల నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు..అయితే... యూనివర్శిటీ అధికారులు లంచం తీసుకుని అనర్హుడైన ఫిరోజ్‌ ఖాన్‌కు ఉద్యోగం ఇచ్చారని విద్యార్థులు ఆరోపణలు చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

రాజ్యంగా హక్కులను కాలరాసిన యూనివర్శిటి

రాజ్యంగా హక్కులను కాలరాసిన యూనివర్శిటి

దీంతో దిగివచ్చిన అధికారులు, విద్యార్థులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రోఫెసర్‌ను ఇతర డిపార్ట్‌మెంట్‌కు బదీలీ చేశారు. అంతకు ముందే ఫ్రోఫెసర్ ఫిరోజ్ ఖాన్ తన డిపార్ట్‌మెంట్ పదవికి సోమవారం సాయంత్రమే రాజీనామా చేసినట్టు యూనివర్శిటి అధికారులు ప్రకటించారు. అయితే భారత రాజ్యంగం ప్రకారాం ఉద్యోగాల్లో కుల ,మత , లింగ వివక్షలు నిషేధించబడ్డాయి. తనకు ఇష్టమైన సబ్జెక్టును ఎన్నుకుని ఉద్యోగం చేసే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. దీంతో కొంతమంది యూనివర్శిటీ అధికారులు ఫిరోజ్‌ఖాన్‌ను మద్దతు ఇచ్చినా... విద్యార్థులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన్ను తప్పించారు.

English summary
The Muslim professor whose appointment to Banaras Hindu University's has resigned from the faculty and will teach Sanskrit at a different department of the same institution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X