వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ విలీనం: ఊహించని రీతిలో!, జతకట్టనున్న స్నాప్ డీల్ ఫ్లిప్ కార్ట్!

ఫ్లిప్ కార్ట్ లో మెజారిటీ షేర్లను కలిగి ఉన్న న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ సైతం షేర్లను విక్రయించనుందని చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజాల మధ్య తీవ్రతరమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓ భారీ విలీనం జరగవచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఈ-కామర్స్ లో దూసుకెళ్తున్న ఆమెజాన్ నుంచి మరో ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటుండటంతో.. ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ రీటైలర్ తో విలీనం కావాలని స్నాప్ డీల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దీనిపై ఇంతవరకు స్నాప్ డీల్ నుంచి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ.. ఇటీవలి సంస్థ పరిణమాలను బట్టి ఈ విలీనం జరగవచ్చునన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులైన స్నాప్ డీల్-ఫ్లిప్ కార్ట్ ఒక్కటవచ్చునని తెలుపుతూ ఓ జాతీయ మీడియా దీనిపై కథనం ప్రచురించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

స్నాప్ డీల్-ఫ్లిప్ కార్ట్ విలీనానికి జపాన్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ సారథ్యం వహిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ మేరకు ఇరు కంపెనీలతో సాఫ్ట్ బ్యాంక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, విలీన సంస్థకు ప్రోత్సహకంగా ఉండేలా సంస్థలో 1బిలియన్ డాలర్లను సాఫ్ట్ బ్యాంకు పెట్టుబడి పెట్టనున్నట్లు చెబుతున్నారు. విలీన అనంతరం ఉమ్మడి సంస్థలో 15శాతం ప్రైమరీ, సెకంరీ షేర్లను సాఫ్ట్ బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

the big online merger is snapdeal going to merge with flipkart

ఫ్లిప్ కార్ట్ లో మెజారిటీ షేర్లను కలిగి ఉన్న న్యూయార్క్ కు చెందిన టైగర్ గ్లోబల్ బిలియన్ సైతం షేర్లను విక్రయించనుందని చెబుతున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం విలీన వార్తలను స్నాప్ డీల్ కొట్టిపారేసింది. ఫ్లిప్ కార్ట్ లేదా ఆమెజాన్ లో స్నాప్ డీల్ విలీనం అవవచ్చునని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సంస్థ లాభాల వైపే పురోగమిస్తుందని, ఇలాంటి వార్తలు అసత్యాలని స్నాప్ డీల్ స్పష్టం చేసింది.

కాగా, పెట్టుబడులను సమకూర్చుకునే క్రమంలో స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ రెండూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిధుల లేమి వల్ల ఉద్యోగులను తగ్గించుకునేందుకు స్నాప్ డీల్ సంస్థ కో ఫౌండర్ కునాల్ చేసిన ప్రకటన ఇందుకు ఊతమిస్తోంది. అలాగే సంస్థ పునరుద్దరణ ప్రణాళిలో భాగంగా షాపోకు బైబై చెబుతున్నట్లు గత నెల స్నాప్ డీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్ కోర్ ప్రాజెక్టులు తొలగించడంతో లాభదాయకమైన వృద్ధిని పెంపొందించుకునేలా సంస్థ చర్యలు చేపడుతోంది.

English summary
In what could make it India's biggest e commerce merger, a news paper has reported that online retailer Snapdeal will merge with its biggest rival Flipkart
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X