వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర..! వ్యతిరేకించిన విపక్షాలు.. పంతం నెగ్గించుకున్న కేంద్రం..!!

|
Google Oneindia TeluguNews

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్ బిల్లు మతానికి సంబంధించింది కాదని, ఇది దేశంలోని ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బిల్లుపై ఎఎన్డీఏ మిత్రపక్షం జేడీయూతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.వ్యతిరేకంగా 82 మంది ఓటు వేశారు.

పార్లమెంట్ కమిటి ఎర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్

పార్లమెంట్ కమిటి ఎర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్

లోక్‌సభలో రెండవసారి త్రిబుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో బిల్లుపై చర్చ చేపట్టారు. ఈనేపథ్యంలోనే త్రిబుల్ తలాక్ బిల్లు మతపరమైనదని,దీని ద్వార పోలీసులు, ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అందోళన వ్యక్తం చేసింది. త్రిబుల్ తలాక్ ద్వార విధించే మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించడంపై కూడ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతోపాటు బిల్లు పార్లమెంట్ కమిటిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం చెప్పారు.

ముస్లిం మహిళల గౌరవం కాపాడేందుకే బిల్లు

ముస్లిం మహిళల గౌరవం కాపాడేందుకే బిల్లు

చర్చలో భాగంగా పాల్గోన్న బిల్లు మతపరమైనది కాదని స్పష్టం చేశారు. ఇది ముస్లిం మహిళల గౌరవాన్ని కాపాడుతుందని తెలిపారు.త్రిబుల్ తలాక్‌పై సుప్రిం కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడ దేశంలో 345 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.కొంతమంది భాదితులు సుప్రింను ఆశ్రయించడంతో సుప్రిం కోర్టు చట్టం తీసుకురావాలని ఆదేశాలు జారి చేసిందని చెప్పారు. ఈనేపథ్యంలోనే బిల్లును తీసుకువచ్చినట్టు ఆయన చెప్పారు.

 పాక్‌తో సహ 21 దేశాల్లో త్రిబుల్ తలక్ పై నిషేధం

పాక్‌తో సహ 21 దేశాల్లో త్రిబుల్ తలక్ పై నిషేధం


మరోవైపు ఇప్పటి వరకు ఇలాంటీ చట్టాలు పాకిస్థాన్, మలేషియాతోపాటు మొత్తం 21 ముస్లిం దేశాల్లో అమల్లో ఉందని వెల్లడించారు. మరి భారత దేశంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయకూడదో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ బిల్లును రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని కోరారు. దీని ద్వార మహిళల హక్కులు ,సాధికారిత సాధ్యమవుతుందని చెప్పారు.కాగా త్రిబుల్ బిల్లును ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీజేపీ లోక్‌సభలో మాత్రం నెగ్గించుకుంది. కాని రాజ్యసభలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
The bill to ban instant Triple Talaq is about gender justice, Union Law Minister Ravi Shankar Prasad said on Thursday as he introduced it in the Lok Sabha for consideration and passing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X