వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని బొంబే హైకోర్టు సంచలన తీర్పు

|
Google Oneindia TeluguNews

వ్యభిచారం చట్ట ప్రకారం క్రిమినల్ నేరం కాదని ,మహిళలకు తమ వృత్తిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఒక వ్యభిచారం కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సంవత్సరం క్రితం ఒక వ్యభిచారం కేసులో ముగ్గురు సెక్స్ వర్కర్లను ముంబైలోని ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంచారు. అయితే వారిని తమ సంరక్షణకు అప్పగించాలని మహిళల తరపు కుటుంబ సభ్యులు మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా చుక్కెదురైంది . ఈ నేపథ్యంలో ఈ కేసు బొంబే హైకోర్టుకు చేరింది .

విచారణ జరిపిన బొంబే హైకోర్టు ఆసక్తికర తీర్పును చెప్పింది.
మూడు నెలల కంటే ఎక్కువ కాలం వారిని హోమ్ లో ఉంచడానికి వీలు లేదని పేర్కొన్న బాంబే హైకోర్టు ధర్మాసనం వారిని విడుదల చేయవలసిందిగా ఆదేశించింది.

The Bombay High Court has ruled that prostitution is not a criminal offence

ఈ ముగ్గురు మహిళలను ప్రభుత్వం వసతి గృహానికి పంపి, వారిలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించారు అధికారులు . అయితే హోం కి పంపించిన తర్వాత వారి సంరక్షకులు తమ వారిని తమకు అప్పగించాలని మజ్గావ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ను కోరారు. మెజిస్ట్రేట్ వారిని సంరక్షకులకు అప్పగించడానికి నిరాకరించారు.

దీంతో వారు మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బొంబే హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ చవాన్ వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని పేర్కొన్నారు. 1956 అనైతిక ట్రాఫికింగ్ చట్టం ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరంగా పరిగణించబడలేదని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో తమ వృత్తిని ఎంచుకోవడం వారి ప్రాథమిక హక్కు అని జస్టిస్ చవాన్ పేర్కొన్నారు
.

పిటిషనర్లు వేశ్యా గృహం నడుపుతున్నారన్న రికార్డులేవీ లేవని పేర్కొంది . అలాంటప్పుడు వారిని ఎలా నేరస్తులుగా పరిగానిస్తారని కోర్టు ప్రశ్నించింది చట్టం ప్రకారం లైంగిక దోపిడి, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని వాడుకోవడం, ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చెయ్యటం, బహిరంగ ప్రదేశాలలో వ్యభిచారం చేయడం వంటివాటిని మాత్రమే నేరాలుగా పరిగణిస్తారు అని కోర్టు తెలిపింది.

English summary
Observing that prostitution was not a criminal offence under the law, and that an adult woman had the right to choose her vocation, the Bombay High Court has ordered immediate release of three women sex workers detained at a state corrective institution in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X