• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరముందు నరేంద్ర మోడీ.. తెరవెనుక ఇద్దరు ఉద్దండులు, మేధస్సు, ప్రజాధారణ కలిగిన నేతలు...

|

న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ భారీ విజయం సాధించింది. ఇందుకోసం నరేంద్ర మోడీ, అమిత్ షా కృషి ఎనలేనిది. అయితే అధికారం చేపట్టాక .. తెరముందు ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. తెరవెనుక ఇద్దరు ఉద్దండుల కృషి ఉంది. వారు తమ మేధస్సు, ప్రజాధారణతో మోడీ సర్కార్‌కు మరింత బూస్ట్ నిచ్చారు. అందుకోసమే తిరిగి రెండోసారి మోడీ ప్రధాని పీఠం అధిష్టించారు. కానీ ఆ ఇద్దరు నేతలు మోడీ 2.0 క్యాబినెట్‌లో లేరు. ఇద్దరూ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండి .. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 18 రోజుల వ్యవధుల్లో ఇద్దరు నేతల మృతి ఆ పార్టీకి, నేతలకు తీరని లోటే.

<strong>కశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ? </strong>కశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ?

ఎవరా ఇద్దరు ..

ఎవరా ఇద్దరు ..

వారిద్దరూ ఎవరో కాదు ఒకరు విదేశాంగ మంత్రిగా పనిచేసి .. గల్ఫ్‌లో ఉన్నవారికి అమ్మగా మారిన సుష్మ స్వరాజ్, మరొకరు సంస్కరణలతో దేశాన్ని వృద్ధి దిశలోకి తీసుకెళ్లిన అరుణ్ జైట్లీ. 2019 ఎన్నికల్లోనే తాను పోటీ చేయబోనని సుష్మ స్వరాజ్ స్పష్టంచేశారు. తర్వాత కొద్దిరోజులకే ... ఆగస్టు 6న ఆమె గుండెపోటుతో చనిపోయారు. తర్వాత 18 రోజులకు బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ కూడా చనిపోయారు. వీరిద్దరూ మృతి బీజేపీ, నేతలు, శ్రేణులు దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కీలక నేత జైట్లీ ..

కీలక నేత జైట్లీ ..

బీజేపీలో అరుణ్ జైట్లీ కీలకనేత. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకుంది బీజేపీ. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి ఉద్దండులు ఉండగా .. మోడీని తెరపైకి తీసుకురావడం .. ఆరెస్సెస్ మద్దతు బీజేపీ చేసిన చారిత్రాక ఘట్టం. ఆ సమయంలో అరుణ్ జైట్లీ కూడా బీజేపీలో కీలక నేత. క్రియాశీలక నేతల్లో ముందువరసలో ఉండే నేత.. కానీ ఆయన మోడీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వంలో నెంబర్ -2 వ్యవహరించారు. కీలకమైన ఆర్థికశాఖ, కొద్దిరోజులు రక్షణశాఖ బాధ్యతలను కూడా చూశారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ఆధార్ అనుసంధానం, పెద్ద నోట్ల రోద్దు, గుడ్స్ అండ్ సర్వీస్ టాక్స్, బినామీ ఆస్తుల వినియోగంపై ఉక్కుపాదం, జైట్లీ ఆర్థికశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన .. కీలక న్యాయసలహాలు మాత్రం ఇచ్చారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎదుర్కొన్న అంశాలకు సంబంధించి కచ్చితమైన వివరణ ఇచ్చారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రఫెల్ ఒప్పందం రద్దు దానిపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం చెప్పారు.

చిన్నమ్మ కూడా ..

చిన్నమ్మ కూడా ..

మోడీ 1.0 ప్రభుత్వంలో చిన్నమ్మ సుష్మ స్వరాజ్ కూడా కీ రోల్ పోషించారు. కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టి .. ఆ పదవీకే వన్నెతీసుకొచ్చారు. గల్ఫ్‌లో ఉన్నవారికి స్వదేశం తీసుకురావడం .. పాకిస్థాన్‌లో చిక్కుకున్న గీతా సింగ్‌ను ఇండియా తీసుకురావడంలో సుష్మ చొరవ అభినందనీయయం. సుష్మ స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టిన సమయంలోనే ప్రధాని మోడీ 90 దేశాలను చుట్టొచ్చి .. రికార్డు సృష్టించారు. అంతేకాదు 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగించేందుకు కూడా సుష్మ స్వరాజ్ నెరిపిన దౌత్యం ఫలించింది. దీంతోపాటు విదేశీ పారిశ్రామిక వేత్తలకు భరోసానిచ్చి .. పెట్టుబడులు పెట్టేందుకు ఊతమిచ్చారు.

English summary
narendra Modi is back with a bang in the Prime Minister’s Office. A bigger majority in the Lok Sabha and a weaker and disoriented Opposition will see a stronger Narendra Modi government-II. But Prime Minister Narendra Modi does not have the luxury of Arun Jaitley, his confidant, and Sushma Swaraj, the quintessential amma for all Indians living abroad. PM Modi will miss their presence in the top four cabinet berths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X