బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ శాఖ వలలో బిల్డర్: రూ. 40 లక్షల లంచం డిమాండ్: అడ్వాన్స్ గా రూ. 14, సీబీఐ అరెస్టు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బిల్డర్ ను బెదిరించి రూ. 14 లక్షలు అడ్వాన్స్ గా లంచం తీసుకుంటున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు నగరంలోని జయనగర్ లోని కాఫీ డే లో నాగేష్ అనే ఐటీ శాఖ అధికారిని అరెస్టు చేసి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.

<strong>ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి వృద్దురాలికి చికిత్స చేసిన మంత్రి, ప్రజాసేవ ముఖ్యం, అధికారం!</strong>ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి వృద్దురాలికి చికిత్స చేసిన మంత్రి, ప్రజాసేవ ముఖ్యం, అధికారం!

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న బిల్డర్ దగ్గర ఆదాయపన్ను శాఖ అధికారి నాగేష్ రూ. 14 లక్షలు లంచం తీసుకున్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. మార్చి 6వ తేదీన బిల్డర్ కార్యాలయం, నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

The CBI caught an Income Tax department officer red-handed for accepting a bribe in Jayanagar.

ఆ సందర్బంలో బిల్డర్ నివాసం, కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కీలక డాక్యూమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖ కేసు నుంచి తప్పించుకోవాలంటే రూ. 40 లక్షలు లంచం ఇవ్వాలని, తరువాత మీకు ఎలాంటి సమస్యలు ఉండవని ఐటీ శాఖ అధికారి నాగేష్ బిల్డర్ కు చెప్పాడు.

ఐటీ శాఖ అధికారి నాగేష్ తనను లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బిల్డర్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సీబీఐ అధికారుల సలహామేరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కాఫీ డే లో అడ్వాన్స్ గా రూ. 14 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఐటీ శాఖ అధికారి నాగేష్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నాగేష్ వెనుక ఐటీ శాఖ అధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారా ? అని విచారణ చేస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు.

English summary
The Central Bureau of Investigation caught an Income Tax department officer red-handed for accepting a bribe in Jayanagar, Bengaluru Karnataka. IT officer identified as Nagesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X