వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 16న ఐఏఎస్ డికే రవి ఎవ్వరిని కలవలేదు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు పలువురిని విచారణ చేసి వివరాలు సేకరించారు. డీకే రవి గన్ మ్యాన్, పర్సనల్ సెక్రటరీ (పీఏ)లను విచారణ చేసి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.

మార్చి 16వ తేదిన డీకే రవి బెంగళూరులోని ఆయన కార్యాలయానికి వెళ్లి కొద్ది సేపు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఏమి జరిగింది, ఎవరైనా వచ్చారా, మాట్లాడారా అని ఆయన పర్సనల్ సెక్రటరిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి రవి ఎక్కడికి వెళ్లారు అని వివరాలు సేకరించారు.

2015 మార్చి 16వ తేదిన డీకే రవి కార్యాలయానికి వచ్చి కొద్ది సేపు ఉన్నారని, కొన్ని ఫైల్స్ పరిశీలించారని, ఆ సమయంలో ఆయన కార్యాలయంలో ఎవ్వరిని కలవలేదని పర్సనల్ సెక్రటరి సీబీఐ అధికారులకు చెప్పారు. పని పూర్తి చేసుకున్న తరువాత తాను ఇంటికి వెళ్లి వస్తానని రవి చెప్పారని స్పష్టం చేశారు.

The CBI questioned the personal assistant and the gunman of D.K Ravi

డీకే రవి ఇంటికి వెళ్లే సమయంలో ఎవ్వరు ఆయన వాహనాన్ని ఫాలో కాలేదని గన్ మ్యాన్ సమాచారం ఇచ్చారు. కోలారు జిల్లా కలెక్టర్ గా డికే. రవి పని చేసిన విషయం తెలిసిందే. అక్కడ పని చేసే సమయంలో రవితో పాటు పని చేసిన సిబ్బందిని సీబీఐ అధికారులు ఇప్పటికే విచారణ చేసి వివరాలు సేకరించారు.

ఉన్నత చదువులు!

డీకే రవి భార్య కుసుమాను ఉన్నత చదువులు చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుసుమా మనస్సులో మాట తెలుసుకుని ఆమె మనస్సు కుదటపడే వరకు చదువుల మీద దృష్టి సారించాలని నచ్చ చెబుతున్నారు.

English summary
The Central Bureau of Investigation questioned the personal assistant and the gunman of D.K Ravi, the IAS officer who was found dead at his residence a few months back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X