వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి కేసు: సిబిఐ విచారణతో ప్రముఖుల గుండెల్లో రైళ్లు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించడంతో పలువురు రాజకీయ నాయకులతో పాటు, బడాబాబులు హడలిపోతున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు బెంగళూరులో అడుగు పెడుతారొ, ఎలాంటి ప్రశ్నలు వేస్తారోననే ఆందోళనకు గురవుతున్నారు.

బెంగళూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖలో రవి పని చేసే సమయంలో పన్ను చెల్లించని బడాబాబుల జాబితాను తయారు చేశారనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. వారిలో రాజకీయ నాయకులతో పాటు, వారి కుటుంబ సభ్యులు, బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాణిజ్య కట్టడాల యజమానులు, భూ కబ్జాదారులు ఉన్నారని తెలిసింది.
సోమవారం రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించడంతో తమకు కష్టకాలం ప్రారంభమైనట్లేనని కొంత మంది నాయకులు వారి సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. సీబీఐ అధికారులకు ఒకటి చెబితే తక్కువ, రెండు చెబితే ఎక్కువ అని ఆందోళన చెందుతున్నారు.

ఎలాగైనా రవి కేసు దర్యాప్తు నుండి తప్పించుకొవడానికి వీరు ఇప్పటి నుండి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సీబీఐ హిట్ లిస్ట్ లో సీఎం సిద్దరామయ్య క్యాబినెట్ కు సంబంధించిన వారు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఉన్నారని వారు ఈ కేసు నుండి తప్పించుకొలేరని పలువురు న్యాయనిపుణులు అంటున్నారు.

 The CBI will take over Ravi's case from the state Criminal Investigation Department (CID),

హొం శాఖ మంత్రి జార్జ్

రవి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించమని పదే పదే చెప్పిన రాష్ట్ర హొం శాఖ మంత్రి జార్జ్ ను ఈ కేసులో మొదట విచారణ చేస్తారని తెలిసింది. జార్జ్ కు చెందిన ఎంబైసి గాల్ప్ లింక్ కంపెనీ రూ. 40 కోట్లు వాణిజ్య పన్ను చెల్లించాలని రవి నోటీసులు జారీ చేశారనే ప్రచారం ఉంది. అయితే రూ. 40 కోట్లకు బదులుగా రూ. 40 లక్షలు వాణిజ్య పన్ను కట్టించుకొవాలని జార్జ్ ఒత్తిడి తీసుకు వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆ వార్తలను జార్జ్ ఖండిస్తున్నారు.

రాణా జార్జ్!

హొం శాఖ మంత్రి కే.జే. జార్జ్ కుమారుడు రాణా జార్జ్. మొదటి నుండి తండ్రి అడుగు జాడలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వచ్చాడు. తండ్రి కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఐఏఎస్ రవి ఎంబైసి కంపెనీ మీద దాడులు చేసి వాణిజ్య పన్ను చెల్లించాలని చెప్పిన తరువాత రాణా జార్జ్ మండిపడ్డారని తెలిసింది.

రాకేష్ సిద్దరామయ్య.............!

సిద్దరామయ్య సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన కుమారుడు రాకేష్ ను రాజకీయాలకు దూరం పెట్టారు. అయితే రాకేష్ మైసూరు, చామరాజనగర, కోడుగు తదితర జిల్లాలలో ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి అండగా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల మీద పరోక్షంగా రాకేష్ ఒత్తిడి తీసుకు వచ్చేవాడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

భైరతి బసవరాజ్...............!

బెంగళూరు నగరంలోని కేఆర్ పురం శాసన సభ్యుడు భైరతి బసవరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భైరతి బసవరాజ్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈయనకు ప్రయివేటు ట్రావెల్స్ (బస్సులు) ఉన్నాయి. ట్రావెల్స్ ఏజెన్సీ నుండి ముక్కు పిండి వాణిజ్య పన్ను వసూలు చేశారని భైరతి బసవరాజ్ రవి మీద కక్ష పెంచుకున్నాడని, ఇదే విషయంలో ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.

వర్తూరు ప్రకాష్..............!

బెంగళూరు పరిసర ప్రాంతాలలో లిటికేషన్ భూముల వ్యవహారాలలో జోక్యం చేసుకుని రాజకీయంగా పైకి వచ్చిన వర్తూరు ప్రకాష్ కోలారు శాసన సభ్యుడు అయ్యారు. తరువాత మంత్రి అయ్యారు. కోలారు పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రవి కోలారు జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో వర్తూరు ప్రకాష్ వేధింపులకు గురి చేశాడని, రవిని అక్కడి నుండి బదిలి చెయ్యించడానికి సీఎం సిద్దరామయ్య మీద ఒత్తిడి తీసుకు వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కోలారులోని ప్రభుత్వ అధికారులను ఫోన్లో బెదిరిస్తున్న ఆడియో క్లిప్పింగ్స్ ను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య విడుదల చేశారు.

నారాయణస్వామి..............!

కోలారు జిల్లా బంగారుపేట శాసన సభ్యుడు నారాయణస్వామి సీబీఐ అధికారుల ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారని తెలిసింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్కడి గోల్ప్ నిర్మించారని నారాయణస్వామి మీద ఆరోపణలు ఉన్నాయి. రవి కోలారు కలెక్టర్ గా వెళ్లిన తరువాత అక్రమంగా నిర్మించిన గోల్ఫ్ ను తొలగించారు. ఈ విషయంలో నారాయణ స్వామి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చి రవిని బదిలి చేయించారని అంటారు.

English summary
2009-batch IAS officer DK Ravi was found hanging at his apartment in Bengaluru on the evening of Monday, March 16.the Chief Minister Siddaramaih-led Karnataka government on Monday entrusted the CBI to further investigate the case in a free and fair manner
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X