వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ చేతికి ఐఏఎస్ ఆఫీసర్ డికే రవి మృతి కేసు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును చేపట్టాలని సీబీఐకి కేంద్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వూలు జారీ చేసింది. సీబీఐ అధికారులు మంగళవారం నుండి ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులోని వాణిజ్య పన్నలు విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి డికే రవి మార్చి 16వ తేదిన ఆయన నివాసం ఉంటున్న కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు సీఐడికి అప్పగించింది.

DK Ravi

ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన వ్యక్తం చెయ్యడంతో మార్చి 24వ తేదిన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. అయితే కేవలం మూడు నెలలలోపు కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలని ఆయన షరతులు పెట్టారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పలు చోట్ల దర్యాప్తు చేశారు.

మూడు నెలలలోపు డి.కే. రవి కేసు దర్యాప్తు పూర్తి చెయ్యడం తమ వల్ల కాదని సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు. తరువాత సిద్దరామయ్య మూడు నెలల షరతును ఉపసంహరించుకున్నామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం నుండి సీబీఐ అధికారులకు అధికారికంగా ఉత్తర్వూలు అందాయి.

English summary
The Department of Personnel and Training has issued a notification for a Central Bureau of Investigation probe into the unnatural death of 2009 batch Indian Administrative Service officer D.K. Ravi. The IAS officer was found dead at his Bengaluru residence on March 16, 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X