వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూల తీర్చిన హోటల్ బిల్లు ,హోటల్‌కు 25000 వేల జరిమాన..

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ తిన్న రెండు అరటిపండ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హొటల్‌కు తగిన గుణపాఠం చెప్పారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈనేపథ్యంలోనే అధిక డబ్బులు వసూలు చేసిన హోటల్‌పై చర్యలు తీసుకున్నారు. దీంతో సంబంధిత హోటల్‌పై రూ.25000 జరిమాన విధించారు.

the Chandigarh hotel has been fined Rs 25,000 in banana case

చండీగఢ్‌లో ఉన్న జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు.అయితే రాహుల్ బోస్ తిన్న రెండు అరటిపళ్లకుగాను హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలిపి రూ.442.50 బిల్లు వేసింది. దీంతో షాక్ తిన్న రాహుల్ 'పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.' అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట్లో ,తెగహల్‌చల్‌ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. హోటల్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండటంతో మారియట్ యాజమాన్యం కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే, ఆ బిల్లును చూసిన ఎక్సైజ్ పన్నుల శాఖ.. అరటి పళ్లకు కూడా జీఎస్టీ వేసినట్టు గుర్తించింది. 9శాతం జీఎస్టీ వేసినట్టు బిల్లులో గుర్తించింది.

అంతకు ముందు అరటిపండ్లపై ఎలాంటి ట్యాక్స్ లేనప్పుడు ఎందుకు విధించారో చెప్పాలంటూ హోటల్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. ఆదాయపు పన్ను శాఖ. తాజా పండ్లు పన్ను పరిమితిలోకి రావని అసిస్టెంట్ ఎక్స్‌సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ రాజీవ్ చౌదరి చెప్పారు. ఏ ప్రాతిపదికన బిల్లువేశారో వివరణ ఇవ్వాల్సిందిగా చండీగడ్‌లోని హోటల్‌ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా విచారణ అనంతరం హోటల్‌పై 25000 వేల రుపాయాల జరిమాన విధించారు.

English summary
after Rahul Bose's video on banana bill in JW Marriott went viral, the Chandigarh hotel has been fined Rs 25,000 by Excise and Taxation Department of the state for violation of Section 11 of CGST ,illegal collection of tax on an exempted item.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X