వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాది సైఫుల్లా తండ్రిని చూసి దేశం గర్విస్తోంది: రాజ్‌నాథ్

ఉగ్రవాది సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన అతని తండ్రిని చూసి ఈ దేశం గర్విస్తోందని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు పార్లమెంటులో అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాది సైఫుల్లా మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన అతని తండ్రిని చూసి ఈ దేశం గర్విస్తోందని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు పార్లమెంటులో అన్నారు.

పేలుళ్ల ఉగ్రవాది.. బాంబు పెట్టి సెల్ఫీ: బంగారం స్వాధీనం, ఎవరీ అతీఫ్? పేలుళ్ల ఉగ్రవాది.. బాంబు పెట్టి సెల్ఫీ: బంగారం స్వాధీనం, ఎవరీ అతీఫ్?

'మృతదేహన్ని తీసుకునేందుకు సైఫుల్లా తండ్రి నిరాకరించారు. అతనిని చూసి ఈ దేశం గర్విస్తోంది. ప్రభుత్వం కూడా సైఫుల్లా తండ్రి మొహమ్మద్ సర్తాజ్‌ను చూసి గర్విస్తోంది' అని రాజ్‌నాథ్ చెప్పారు.

The country is proud of Saifullah's father: Rajnath Singh

కాగా, మధ్యప్రదేశ్‌లో మంగళవారం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్‌ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన సైఫుల్లాను పోలీసులు మట్టుబెట్టారు. అతని మృతదేహన్ని తీసుకునేందుకు అతని తండ్రి నిరాకరించారు.

ఆ దేశ ద్రోహి శవం కూడా తమకు అవసరం లేదని లక్నో ఎన్‌కౌంటర్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది సైపుల్లా తండ్రి సర్తాజ్ తేల్చి చెప్పారు. కాగా, పోలీసులు అతనిని సజీవంగా పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అతను లొంగలేదు. దీంతో ఎన్‌కౌంటర్లో చనిపోయాడు.

English summary
'Saifullah's father has refused to take his body. The country is proud of Saifullah's father' says Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X