వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ ఎమ్మెల్యే శశిపై లైంగిక వేదింపుల ఫిర్యాదు, మహిళా నేత, ఒక సంవత్సరం, విచారణ!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో భారీ వరదల కారణంగా ప్రజలను ఆదుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. ఇప్పుడు సీపీఐ (ఎం) పార్టీకి చెందిన కేరళ సీనియర్ ఎమ్మెల్యే పీకే. శశి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం, మహిళా నాయకురాలు పార్టీ కేంద్ర కమిటీని ఆశ్రయించడంతో కేరళ ప్రభుత్వం ఉలిక్కిపడింది.

గతంలో పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు ఆరోపణలు చేస్తున్నారు. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్ వైఐ)కు చెందిన నాయకురాలు ఎమ్మెల్యే పీకే శశిమీద లైంగిక వేదింపుల ఆరోపణలు చేశారు.

సీపీఐ (ఎం) ఎమ్మెల్యే పీకే. శశి గత ఏడాది నుంచి తనను లైంగికంగా వేదింపులకు గురి చేస్తున్నారని ఆగస్టు నెలలలో కేరళ పార్టీ కార్యదర్శి కూడియేరి బాలకృష్ణన్ కు, పాలక్కాడ్ జిల్లా కమిటీకి లేఖ రాసినా ఇంత వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు.

The CPI(M) will probe charges of alleged sexual harassment filed against Kerala MLA PK Sasi

రాష్ట్ర కమిటీ పెద్దలు ఎమ్మెల్యే పీకే. శశి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు బృందా కారత్, సీతారాం ఏచూరికి లేఖ రాశారు. ఒక్క సంవత్సరం నుంచి తనను ఎమ్మెల్యే పీకే. శశి లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని బాధితురాలు మనవి చేశారు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పీకే. శశి తన రాజకీయ జీవితం నాశనం చెయ్యాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎవ్వరినీ లైంగికంగా వేదించలేదని అన్నారు. అయితే కేరళలో పాలక్కాడ్ జిల్లా కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే పీకే. శశి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎం) పార్టీ కేంద్ర కమిటీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

English summary
The CPI(M) will probe charges of alleged sexual harassment filed against legislator PK Sasi by a young woman leader on Tuesday after the central leadership directed the state unit to look into the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X