వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 ఏళ్లుగా వ్యక్తి వెంట పడుతున్న కాకులు...! ఎందుకో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

కాకులు మనష్యులను గుర్తుపెట్టుకుంటాయా ....తమకు హాని చేసిన మనిషిని గుర్తుపెట్టుకుని మరి వెంటాడాతాయా...? ఐక్యమత్యానికి మారుపేరుగా వ్యవహరించే కాకులు శతృత్వానికి కూడ ఒడిగడతాయా...? అంటే అవుననే చెప్పాలి. ఇలా తమకు హాని చేశాడని భావించిన ఓ వ్యక్తిని ఒకటి కాదు, రెండు కాదు, మూడు సంవత్సరాల నుండి మనిషిని గుర్తు పెట్టుకుని వెంటాడుతున్నాయి. కాకి పిల్లను చంపిన పాపానికి ప్రతి రోజు వెంటపడుతున్న సంఘటన మధ్యప్రదేశ్‌లో చేటుచేసుకుంది.

వ్వక్తిపై శతృత్వం పెంచుకున్న కాకులు

వ్వక్తిపై శతృత్వం పెంచుకున్న కాకులు

ఐకమత్యానికి నిదర్శం కాకులు ,ఏదైన కాకి ప్రమాద వశాత్తు చనిపోతే గుంపుగా వచ్చి తమ సంఘీబావం తెలుపుతాయి. చాల సేపు కావు, కావు అంటూ అరుస్తూ గుంపులుగా చేరుతాయి. అయితే అవే కాకులు తమ తోటి ప్రాణిని చంపితే మాత్రం శత్రువుగా చూస్తున్నాయి.ఇలా తమ జాతికి చెందిన చిన్న కాకిపిల్లను ఓ వ్యక్తి చంపాడని అతనిపై మూడు సంవత్సరాలుగా శత్రుత్వం పెంచుకున్నాయి. ఆ వ్యక్తి బయటకు వస్తున్న నేపథ్యంలోనే దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఆయన ఇంటిబయట కాపాల కాస్తున్నాయి.

కాకిపిల్లను చంపిన వ్యక్తిని గుర్తు పెట్టుకున్న కాకులు

కాకిపిల్లను చంపిన వ్యక్తిని గుర్తు పెట్టుకున్న కాకులు

మధ్యప్రదేశ్‌ శివపురికి చెందిన శివకేవత్ అనే వ్వక్తి ప్రతి రోజు ఇబ్బంది పడుతున్నాడు. అయితే తాను ఆర్ధికంగా గాని, పనిలేక కాదు కాకుల శతృత్వంతో ఇబ్బంది పడుతున్న వింత సంఘటన చోటుచేసుకుంది. ఇలా ఒకటి కాదు రెండు రోజులు కాదు ఏకంగా మూడు సంవత్సరాలుగా కాకులు ఆయన వెంటపడుతున్నాయి. గత మూడు సంవత్సరాల క్రితం తన ఇంటి వద్ద ఓ వలలో కాకి పిల్ల చిక్కుకుని విలవిల కొట్టుకుంటుంది... దీంతో శివకేవత్ మానవత్వంతో కాకిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశాడు. వల వద్దకు వెళ్లి కాకిని బయటకు తీశాడు. అయితే అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాపిపిల్ల దురదృష్టవశాత్తు తన చేతుల్లోనే చనిపోయింది. ఇంకేముంది శివకేవత్ చేతుల్లో కాకిపిల్ల చనిపోవడం తోటి కాకులు చూశాయి. దీంతో తమ జాతికి చెందిన కాకిపిల్లను చంపావంటూ ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుని దాడి చేస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి బయటకు వచ్చిన ప్రతిసారి చేతిలో కట్టేను పట్టుకుని వస్తున్నాడు.

వెంటపడి రక్కుతున్న కాకులు

వెంటపడి రక్కుతున్న కాకులు

ఇక శివకేత్ ఎప్పుడు బయటకు వచ్చిన ఆయన వెంటపడుతున్నాయి.. వెంటపడడమే కాదు ఆయన చేతులపైన, తలపైన రక్కుతున్నాయి. ఇలా కొద్ది రోజులు ఎం అర్థం కాని శివకేత్ ఇతరులను ఇలాగే చేస్తున్నాయని భావించాడు.ఇలా శివకేవత్ బయటికి వెళ్లిన ప్రతిసారి కాకులు వెంటపడుతున్నాయి. ఆయన ఎప్పుడు బయటకు వెళతాడా అంటూ ఎదురు చూస్తున్నాయి. ఇక చేసేది ఏమి లేక శివకేత్ తన వెంట బయటకు వెళ్లిన ప్రతిసారి ఓ కట్టేను తీసుకువస్తున్నాడు. అయితే కాకులకు తాను న్యాయం చేయబోతే ఇాలా జరగిందని వాపోతున్న కేవత్ ఏదో ఒక రోజు కాకులు తనను క్షిమిస్తాయని భావిస్తున్నాడు. మరి శివకేవత్ భావించినట్టుగా కాకులు ఏమేరకు క్షమిస్తాయో వేచి చూడాలి....!

English summary
A resident of a village in Madyapradesh has been the target of crows for 3 years.The crows have identified him as their enemy and have been taking revenge every day for 3 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X