వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు, మేము జోక్యం చేసుకోం, టీపికి నో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైయ్యింది. టీటీవీ దినకరన్ సమర్పించిన పిటిషన్ విచారణ చెయ్యడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషన్ అధికారుల విషయంలో తాము జోక్యం చేసుకోమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు గతంలో కేటాయించిన టోపీ గుర్తు ఇవ్వాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేస్తున్నాడు.

The Delhi High Court has dismissed TTV Dinakaran's petition

టోపి గుర్తు తనకే కేటాయించాలని టీటీవీ దినకరన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని ఎన్నికల అధికారులు ఏకపక్షంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు కేటాంచారని ఆరోపిస్తు మరో పిటిషన్ దాఖలు చేశారు. టీటీవీ దినకరన్ సమర్పించిన పిటిషన్ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు గుర్తులు కేటాయించడం భారత ఎన్నికల కమిషన్ బాధ్యత అని గుర్తు చేసిందిద. గుర్తులు కేటాయించే విఫయంలో మేము ఎలా జోక్యం చేసుకుంటాం అంటూ ఢిల్లీ హైకోర్టు టీటీవీ దినకరన్ పిటీషన్ ను కొట్టివేసింది.

English summary
The Delhi High Court has dismissed TTV Dinakaran's petition to allocate the hat symbol in RK Nagar by poll. TTV Dinakaran filied a case against Double leaf symbol and hatsymbol in the RK Nagar by poll 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X