వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూ కబ్జా కేసు, ఆప్ ఎంఎల్ఏ అరెస్టు: పోలీసు కస్టడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. విచారణ పేరుతో ఆ పార్టీ శాసన సభ్యుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. విచారణ పూర్తి అయిన తరువాత యూ ఆర్ అండ్ అరెస్ట్ అన్నారు. నేరుగా పిలుచుకుని వెళ్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

ఢిల్లీలోని కొండ్లి శాసన సభ నియోజక వర్గం శాసన సభ్యుడు మనోజ్ కుమార్ మీద భూ కబ్జా కేసు నమోదు అయ్యింది. గత సంవత్సరం నమోదు అయిన ఈ కేసులో గురువారం మనోజ్ కుమార్ ను విచారణకు రావాలని న్యూ అశోక్ నగర పోలీసులు చెప్పారు.

The Delhi Police arrested AAP legislator Manoj Kumar

మనోజ్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. చాల సేపు విచారణ చేసిన తర్వాత మనోజ్ కుమార్ ను అరెస్టు చేశామని ఢిల్లీ ఉత్తర రేంజ్ జాయింట్ కమిషనర్ సంజయ్ బెనివాల్ అన్నారు. తరువాత అతనిని ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రో సాలిటన్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.

తరువాత మనోజ్ కుమార్ ను విచారించడానికి కస్టడికి ఇవ్వాలని పోలీసులు కోర్టులో మనవి చేశారు. రెండు రోజుల పాటు విచారణ చెయ్యడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గత సంవత్సం నమోదు అయిన కేసు విషయంలో ఇప్పుడు అరెస్టు చెయ్యడం ఏమిటి అని ఆప్ నాయకులు మండిపడుతున్నారు.

English summary
The Delhi Police arrested AAP legislator Manoj Kumar in connection with a case of land fraud on Thursday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X