Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశికళ కథ క్లైమాక్స్: టీటీవీ దినకరన్ ప్లాన్ రివర్స్: ఏం జరుగుతుందో!

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ సర్వాధికారాలతో సహ రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయించాలని అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిద్దం అయ్యింది. వీకే శశికళ భవిష్యత్తు సైతం నిర్ణయించడానికి ఎన్నికల అధికారులు సిద్దం అయ్యారు.

అన్నాడీఎంకే పార్టీ, రెండాకు చిహ్నం కోసం తమిళనాడు మాజీ మంత్రి పన్నీర్ సెల్వం, శశికళ వర్గం ఎన్నికల కమిషన్ ముందు పోటీపడుతున్నాయి. మాదే అసలైన పార్టీ అంటూ ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్ ముందు వాదిస్తున్నాయి.

అసలు సమస్య ఇదే

అసలు సమస్య ఇదే

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి (తాత్కాలిక)గా శశికళ నియామకం చెల్లదని పన్నీర్ సెల్వ వర్గం వాదిస్తోంది. నియమాల ప్రకారమే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని ఆమె వర్గీయులు వాదిస్తున్నారు. శశికళ నియామకం విషయం మొదట పరిష్కరించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

దినకరన్ స్కెచ్ ప్లాప్

దినకరన్ స్కెచ్ ప్లాప్

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను కొనసాగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర సంతకాలు చేయించాలని టీటీవీ దినకరన్ ప్లాన్ చేశారు. కనీసం 10 లక్షల మంది అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తల దగ్గర సంతకాలు సేకరించాలని స్కెచ్ వేసిన ఆయన ప్లాన్ బెడిసికొట్టంది.

సమయం కావాలని అడిగిన శశికళ వర్గం

సమయం కావాలని అడిగిన శశికళ వర్గం

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎలా నియమించాం అనే విషయంపై పూర్తి సమాచారం ఇవ్వడానికి తమకు 8 వారాలు సమయం కావాలని చిన్నమ్మ వర్గీయులు ఎన్నికల కమిషన్ కు ఇటీవల మనవి చేశారు. అయితే సమయం ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దూకుడుగా పన్నీర్ సెల్వం వర్గం

దూకుడుగా పన్నీర్ సెల్వం వర్గం

అన్నాడీఎంకే పార్టీతో సహ రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు దూకుడుగా వెలుతున్నారు. ఎలాగైనా అన్నాడీఎంకే పార్టీని దక్కించుకుని శశికళ వర్గానికి చుక్కలు చూపించడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు సిద్దం అయ్యారు.

రేపు తేలిపోతుందా ?

రేపు తేలిపోతుందా ?

అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయించాలి అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సిద్దం అయ్యింది. సోమవారం శశికళను ఏ నియమాల ప్రకారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు అనే విషయంపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+