బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ అర్జీ విచారణ మంగళవారంకు వాయిదా పడింది. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారంకు వాయిదా పడింది. ఇదే సమయంలో ఈడీ అధికారులు డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఐటీ దాడుల దెబ్బ, మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య, అధికారుల టార్చర్ !ఐటీ దాడుల దెబ్బ, మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య, అధికారుల టార్చర్ !

 తీహార్ జైలు

తీహార్ జైలు

మనీ ల్యాండరింగ్ (అక్రమ నగదు లావాదేవీలు)లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సెప్టెంబర్ 3వ తేదీన మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను అరెస్టు చేశారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న డీకే. శివకుమార్ రిమాండ్ గడుపు అక్టోబర్ 15వ తేదీ పూర్తి కానుంది.

 డీకేకి అనారోగ్యం

డీకేకి అనారోగ్యం

సోమవారం డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ విచారణ ఢిల్లీ కోర్టులో జరిగింది. అనారోగ్యంతో ఉన్న డీకే. శివకుమార్ ఈడీ అధికారుల విచారణకు సహకరిస్తున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు మనవి చేశారు.

నో బెయిల్

నో బెయిల్

బెయిల్ పిటిషన్ విచారణ చేసిన ఈడీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి మంగళవారంకు విచారణ వాయిదా వేసింది. మంగళవారం డీకే. శివకుమార్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు వాదనలు వినిపించడానికి సిద్దం అయ్యారు.

 డీకే తల్లికి రూ. 273 కోట్ల బినామీ ఆస్తులు ?

డీకే తల్లికి రూ. 273 కోట్ల బినామీ ఆస్తులు ?

డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి మంగళవారం కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మ దగ్గర రూ. 273 కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.

 డీకే కూతురు ఐశ్వర్య

డీకే కూతురు ఐశ్వర్య

డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు 5 ఎకరాల పోలంను గౌరమ్మ గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారని వెలుగు చూసింది. డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి, ఆమె పేరుతో ఎవరెవరు వ్యాపారాలు చేశారు అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

 డీకే ఫ్యామీలీ విచారణ

డీకే ఫ్యామీలీ విచారణ

ఇప్పటికే డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, డీకే సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్, వీరి మామ తిమ్మయ్యలను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇప్పుడు డీకే. శివకుమార్ తల్లి గౌరమ్మకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

English summary
New Delhi: The ED has issued summons to former minister DK Shivakumar's mother Gauramma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X