వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్‌లోనే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు... ఈసీ సమావేశం..

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ విభజనపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని విధంగా రాష్ట్రాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం, అంతే వడివడిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనను తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహాణ,అసెంబ్లీ సీట్ల డీ లిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమీషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కశ్మీర్ ఎన్నికలు డీలిమిటేషన్ ప్రక్రియపై ఈసీ సభ్యులు అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కశ్మీర్‌లో ఎన్నికలు ఎన్నికల సంఘం చర్యలు

కశ్మీర్‌లో ఎన్నికలు ఎన్నికల సంఘం చర్యలు

కేంద్రప్రభుత్వ నిర్ణయం తర్వాత జమ్ము కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటయిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31 నుండి పూర్తిస్థాయిలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగనుంది. మరోవైపు ప్రస్థుత కశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రెండు సార్లు గవర్నర్ పాలనను కేంద్రం పోడగించిన నేపథ్యంలోనే స్థానిక పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అయితే గవర్నర్ పాలన పోడిగించే సమయంలోనే, త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో హమిఇచ్చాడు. దీంతో గవర్నర్ పాలనను తొలగించి,పూర్తిస్థాయి ప్రజాస్వామ్య పాలన అంకురార్పణకు కేంద్రంతో పాటు ఇటు ఎన్నికల కమీషన్ నడుం బిగించింది.

అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ,ఏడు అసెంబ్లీ స్థానాల పెంపు

అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ,ఏడు అసెంబ్లీ స్థానాల పెంపు


జమ్ము కశ్మీర్ పునర్వీభజన ప్రకారం ప్రస్థుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యులు, సీట్ల పెంపుతోపాటు డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి ఇటివల కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పునర్విభజన చట్టాలను కూడ పరిశీలించినట్టు తెలుస్తోంది. దీంతో కశ్మీర్‌లో ప్రస్థుతం ఉన్న 107 స్థానాలకు గాను ఏడు సీట్ల పెంపుతో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య 114 కు చేరనుంది. సమావేశంతో త్వరలోనే కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

 అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు,

అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు,

ఇక ఎన్నికల కమీషన్ నిర్ణయం ప్రకారం రానున్న రెండు నెలల్లో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేసి అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నవంబర్ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు వాతవరణం కూడ అనుకూలించక పోవడం కూడ ఇందుకు కారణమని చెబుతున్నారు. కాగా రెండు దశబ్దాల తర్వాత కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 2002లో కశ్మీర్ ప్రభుత్వం, 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియ లేకుండా నిర్ణయం తీసుకుంది.

English summary
The Election Commission of India on Tuesday held an internal meeting on the issue of delimitation to be carried out in Jammu and Kashmir after Parliament passed the Jammu and Kashmir Reorganisational Bill last week
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X