వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాఫీడే సిద్దార్థ్ గ్రేట్: చెవిటి, మూగవాళ్లకు ఉద్యోగులు..! వారు ఇట్టే వాసన పసిగట్టగలరట..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కాఫీ అమ్మకాల సంస్కృతిలో కేఫ్ కాఫీ డే ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో అంతే స్థాయిలో సంబంధాలను కూడా కలిపింది. భారతీయ కాఫీ సంస్కృతిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన 'కేఫ్‌ కాఫీ డే' వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట.

 కాఫీడేలో షాపుల్లో కొత్త కోణం..! ఉద్యోగస్తులందనికి అదే లోపం..!!

కాఫీడేలో షాపుల్లో కొత్త కోణం..! ఉద్యోగస్తులందనికి అదే లోపం..!!

ఇలాంటి వాళ్లను కార్పొరేట్‌ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణన్‌ తెలిపారు. ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క 'కేఫ్‌ కాఫీ డే' లకే పరిమితం కాలేదు.

 కాఫీడేలో మూగ, చెవిటి ఉద్యోగులు..! వాసన చూసి కాఫీ టేస్టు చెప్పేవారట..!!

కాఫీడేలో మూగ, చెవిటి ఉద్యోగులు..! వాసన చూసి కాఫీ టేస్టు చెప్పేవారట..!!

కేఎఫ్‌సీలోని 'కాఫీ కోస్టా' అవుట్‌లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ 'కాఫీ కోస్టా' అవుట్‌ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్‌లెట్‌ మేనేజర్‌ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్‌ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు.

 అంగవైకల్యం ఉన్న వారే సరి..! తక్కువ వేతనాలకు వస్తారనే భావన..!!

అంగవైకల్యం ఉన్న వారే సరి..! తక్కువ వేతనాలకు వస్తారనే భావన..!!

స్టార్‌బక్‌ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్‌ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్‌ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే.

ఎన్నో వ్యాపారా లావాదేవీలకు వేదిక కాఫీడే..! ప్రేమలు చిగురించింది కూడా అక్కడే..!!

ఎన్నో వ్యాపారా లావాదేవీలకు వేదిక కాఫీడే..! ప్రేమలు చిగురించింది కూడా అక్కడే..!!

దేశవ్యాప్తంగా దాదాపు 200 అవుట్‌లెట్‌లు కలిగిన 'కేఫ్‌ కాఫీ డే ' వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషాదాంత నేపథ్యంలో 'కేఫ్‌ కాఫీ డే' లతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన పలు వర్గాల భారతీయులు వాటితో పెనవేసుకున్న తమ మధురానుభూతులను సోషల్‌ మీడియా సాక్షిగా నెమరేసుకుంటున్నారు. వ్యాపార వర్గాలతోపాటు కాలేజీ యువతీ యువకులకు ఈ కాఫీ డేలతో ఎంతో అనుబంధం మిగిలి ఉంది. వ్యాపార రంగానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు వీటిల్లో కూర్చుని కాఫీలు సేవిస్తూ వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతోపాటు పలు భారీ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన యువతీ యువకుల మధ్య ఎక్కువ డేటింగ్‌లు మొదలయిందీ ఈ కాఫీ డేల నుంచే.

English summary
In every store of coffee day, most of the experts who mix coffee are dumb and deaf. They have the ability to easily detect a variety of coffee smells. In addition, they can also identify the flavors correctly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X